లలిత్‌పూర్‌లోని దేవాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా 11 గంటల ప్రాంతంలో మోటారు సైకిల్‌పై ఇద్దరు దుండగులు వెంటాడి, రాణా ప్రయాణిస్తున్న కారును మార్గమధ్యంలో ఆపి కాల్పులు జరిపారు. ఛాతీ, మెడ, పొట్ట భాగాల్లో తూటాలు దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలతో ఉన్న రాణాను వెంటనే దగ్గర్లోని నోర్విక్ ఆస్పవూతికి తీసుకెళ్లారు. నేపాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాణా బహదూర్ బామ్‌ను ఖట్మాండ్‌లో దుండగులు కాల్చి చంపారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాణా వ్యక్తిగత భద్రతా అధికారికి బుల్లెట్ గాయమైంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసుల అధికార ప్రతినిధి రబిరాజ్ శ్రేష్ఠ తెలిపారు. 61 ఏళ్ల బహదూర్ బామ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై నేపాల్ పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా పెండింగ్‌లో ఉంది. అవినీతికి పాల్పడినందుకు రాణాపై ఈ చర్య తీసుకుంటున్నట్లు నేపాల్‌బ్యాడ్ పార్టీ పేరుతో ఒక కరపత్రం ఘటనా ప్రాంతంలో లభించినట్లు మీడియా పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more