కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ భారతదేశ 81 ఆర్థిక బడ్జెట్‌ను మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రణబ్ ప్రవేశపెడుతున్న 7వ బడ్జెట్. మురార్జీదేశాయ్ 10 సార్లు భారత బడ్జెట్ ప్రవేశపెట్టగా, రెండవ స్థానంలో 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రణబ్, చిదంబరం, యశ్వంత్ సిన్హా, వైబి చవాన్, సిడి దేశ్‌ముఖ్ ఉన్నారు. భారతదేశ తొలి బడ్జెట్‌ను ఆర్‌కె షణ్ముఖమ్ శెట్టి ప్రవేశపెట్టారు. మన్మోహన్ కేవలం ఆరుసార్లే బడ్జెట్ రూపొందించారు. ఇదిలా ఉండగా, ప్రతి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు పార్లమెంటు ముందర ఎర్రసూట్కేసు విలేఖర్లకు చూపడం అంతర్జాతీయ సంప్రదాయం. ఈ విధంగా మామిడి చిగురు రంగులోని సూట్కేసునే ఎందుకు వాడతారు అనేదానికి కూడా ఒక చరిత్రుంది. ఇది దొరల నుంచి దిగుమతి అయిన సంప్రదాయం. అయితే ఇది ఫ్రెంచి సంప్రదాయ సూట్కేసు అనేవారు లేకపోలేదు. ఆంగ్లేయులు మాత్రం ఒకే బ్రీఫ్‌కేసును వాడతారు. ఇది ఒక మంత్రి తరువాత మరో మంత్రికి ఆర్థికశాఖ వారసత్వ సంపదలా వెళుతుంది. 18వ శతాబ్దంనాటి సూట్కేసును ఇటీవల 2010లో వాడకం నుంచి తప్పించి మ్యూజియంకు తరలించారు. దీని వయసు 210 ఏళ్లు. బారో అండ్ గాలే సంస్థ 1800లో దీన్ని తయారు చేసి, అప్పటి మంత్రులకు ఇచ్చింది. ఈ బాక్స్‌తో విలియం ఇవార్ట్ గ్లాడ్‌స్టోన్ 1853లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 5 గంటల సమయం తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more