Vande Bharat Express engine damaged after hitting cattle వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం.. ఇంజన్ డ్యామేజ్

Gandhinagar mumbai vande bharat express engine damaged after hitting cattle

vande bharat train, vande bharat, vande bharat express, vande bharat accident, Vande Bharat Train Accident, vande bharat train route ticket price, vande bharat train schedule, vande bharat express train no, vande bharat train ahmedabad to mumbai, vande bharat express train route in gujarat, vande bharat express mumbai, vande bharat express booking, vande bharat express gandhinagar to mumbai, Vande Bharat Express, vande bharat train

The newly launched Mumbai Central-Gandhinagar Vande Bharat Express met with an accident after a herd of buffaloes came on the railway track. The front part of the train engine was damaged, said a railway official.

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం.. గేదల‌ను ఢీకొని ఇంజన్ డ్యామేజ్

Posted: 10/06/2022 06:44 PM IST
Gandhinagar mumbai vande bharat express engine damaged after hitting cattle

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదానికి గురైంది. ముంబై సెంట్ర‌ల్ నుంచి గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌కు వెళ్తున్న రైలు గేదల మంద‌ను ఢీకొన్న‌ది. ఇవాళ ఉద‌యం 11.15 నిమిషాల‌కు వ‌త్వా స్టేష‌న్ నుంచి మ‌ణిన‌గ‌ర్ మ‌ధ్య ఉన్న రైల్వేలైన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌మాదం వ‌ల్ల ఇంజిన్ ముందు భాగం ధ్వంస‌మైన‌ట్లు ప‌శ్చిమ రైల్వే సీనియ‌ర్ పీఆర్వో జేకే జ‌యంత్ తెలిపారు. వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ‌త నెల‌లో ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అనంత‌రం ప్ర‌ధాని మోదీ.. గాంధీ న‌గ‌ర్ నుంచి కాలుపూర్ రైల్వే స్టేష‌న్(అహ్మ‌దాబాద్‌) వ‌ర‌కు ప్ర‌యాణించారు.

ఈ ఎక్స్‌ప్రెస్ గాంధీ న‌గ‌ర్ – ముంబై మ‌ధ్య సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా కవచ్ (Kavach) టెక్నాలజీ. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. సాంకేతిక తప్పిదం వల్ల రైళ్లు ఒకే ట్రాక్‌పై వస్తే, వాటి మధ్య కిలోమీటర్ దూరం ఉండగానే.. ఈ వ్యవస్థ హెచ్చరికలు చేసి, రైలు వేగాన్ని ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles