జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. రాష్ట్రంలోని దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోగల బారాముల్లా జిల్లాలోని ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో భద్రత బలగాలు ఉగ్రవాదులను హతమార్చాయి. వుల్వామా జిల్లాలోని యెడిపోరాలో ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా ఈ యేడిపోరాలో ప్రాంతంలో ఇప్పటికీ ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. బారముల్లా జిల్లాలోని యేడిపోరాలో అగ్నిపాత్ పథకం కింద ఇటీవల అహ్వానించిన ధరఖాస్తుల ఎంపిక కొనసాగుతోంది. కాగా, అభ్యర్థులను అగ్నివీర్ కింద రిక్రూట్ మెంట్ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపాలరి పథక రచన చేశారు. అయితే వాటిని భారత భద్రతా బలగాలు తమ కార్డన్ సర్చ్ తో భగ్నం చేశారు. ఈ క్రమంలో బారాముల్లా జిల్లాలోని యోడిపోరా పట్టణ ప్రాంతంలో ఇవాళ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు.
బారాముల్లా జిల్లాలోని యెడిపోరా, పట్టణ ప్రాంతంలో ఇవాళ ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. షోపియాన్‌లోని చిత్రగామ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని, పోలీసులు.. భద్రతా దళాలు పనిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల గురించి అందిన పక్కాగా అందించిన సమాచారం మేరకు.. పోలీసులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more