Zerodha announces new fitness challenge for employees వర్క్ ఫ్రం హోం ఉద్యోగులారా.. బరువు తగ్గితే బంపర్ ఆఫర్..

Zerodha ceo challenges employees to lose weight offers 10 lakh as reward

Zerodha employees, Nithin Kamath, LinkedIn, Online broking firm, fitness, fitness challenge, participant, 10 lakh Prize, Health

A new fitness challenge for staff members has been introduced by online brokerage company Zerodha, adding to a long list of staff health-related activities. According to CEO Nithin Kamath, completing this challenge will earn workers generous incentives, and one lucky participant might even win ₹ 10 lakh.

వర్క్ ఫ్రం హోం ఉద్యోగులారా.. బరువు తగ్గితే బంపర్ ఆఫర్..

Posted: 09/26/2022 02:21 PM IST
Zerodha ceo challenges employees to lose weight offers 10 lakh as reward

దాదాపుగా మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తమ ఉద్యోగులు.. ఇంట్లో తింటూ పనిచేస్తూ బరువు పెరిగిపోయి ఉంటారన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్యోగులు బరువు పెరిగడం వల్ల తమ సంస్థకు వచ్చిన నష్టమేమి లేదు కానీ.. వారి ఆరోగ్యాలను పరిరక్షించకపోతే భవిష్యత్తులో మాత్రం ప్రమాదం తప్పదని భావించిన ఓ సీఈఓ తమ ఉద్యోగుల ఆరోగ్యాలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఓ సవాల్ విసిరాడు. అయితే ఇది సవాల్ ఏ మాత్రం కాదన్న విషయం తెలిసినా.. వారి అరోగ్యాల కోసం ఇలాంటి ట్విస్టు పెట్టాడు. ఇది సవాల్ అనడం కన్న ఉద్యోగుల ఆరోగ్యంపై ఆయన బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించారు.

వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. దీంతో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదని భావించిన ఈ సీఈఓ తమ ఉద్యోగుల కోసం ఓ భారీ ఆఫర్ ప్రకటించారు. ఉద్యోగుల అరోగ్యంపై శ్రద్ద చూపిన ఆ కంపెనీ ఏదీ.. ఆ సంస్థ సీఈఓ ఎవరు అని అడుగుతున్నారా.? అదే ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా. ఇక ఉద్యోగుల కళ్లలో సంతోషం నింపే ప్రకటన చేసింది మాత్ర ఆ సంస్థ సీఈఓ నితిన్ కామత్. ఇదిలా ఉంటితే ఇంటకీ ఆఫర్ ఏంటో తెలుసా.?.

బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్‌నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles