BJP MP cleans toilet with 'bare hands' in school ఒట్టి చేతులతో పాఠశాల మరుగుదొడ్డిని కడిగిన బీజేపి ఎంపీ..!

Viral video madhya pradesh bjp mp janardan mishra cleans school toilet with bare hands

BJP MP Janardan Mishra, BJP MP cleans toilet, BJP MP cleans toilet bare hands, Janardan Mishra, Janardan Mishra BJP, Janardan Mishra MP, BJP MP cleans toilet in school, BJP MP cleans toilet Khatkahri, Swachhata Pakhwada, Janardan Mishra TWITTER, Madhya Pradesh, Madhya Pradesh news, BJP MP Janardan Mishra cleans toilet, viral video

In a video that has gone viral on social media, BJP Lok Sabha member from Madhya Pradesh's Rewa, Janardan Mishra, can be seen cleaning the toilet of a girls' school in his constituency with his bare hands. The video was shot during the parliamentarian's visit to the school in Khatkhari to participate in a plantation programme as a chief guest.

ITEMVIDEOS: ఒట్టి చేతులతో పాఠశాల మరుగుదొడ్డిని కడిగిన బీజేపి ఎంపీ..! విమర్శల వెల్లువ

Posted: 09/23/2022 08:28 PM IST
Viral video madhya pradesh bjp mp janardan mishra cleans school toilet with bare hands

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎంపీ ఓవరాక్షన్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో ప్రవేశపెట్టిన స్వచ్చా భారత్ మిషన్ ను తప్పుగా అర్థం చేసుకున్న మనం పార్లమెంటు సభ్యుడు.. అపరిశుభ్రత - అనారోగ్యం అనే అంశాన్ని రేపటి పౌరులకు చాటుతూ సందేశాన్ని ఇచ్చాడు. దేశంలో స్వచ్చా భారత్ అంటే ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని, చెప్పడంతో పాటు పరిశ్రుభతతో కూడిన వాతావరణాన్ని దేశమంతా వ్యాపించజేయాలన్న ఉద్దేశ్యాన్ని మధ్యప్రదేశ్ ఎంపీ మార్చేశారు. పాఠశాలలోని మరుగుదోడ్లను ఒట్టి చేతులతో శుభ్రం చేశారు.

మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం.. గత మంగళవారం తమ పాఠశాలలో ఐదవ, ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థినుల చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఈ విషయం స్థానికుల కంటపడటంతో వారు ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్తా వైరల్‌ కావడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై విచారణ జరిపించి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా నెట్టింట్లో వినిపించాయి. అదే సమయంలో రేవా జిల్లాలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటన జరిగింది.

ఈ నేపథ్యంలో రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తాజాగా పాఠశాల వద్దకు చేరుకుని ఓవరాక్షన్‌ చేశారు. బీజేపి పార్టీ నిర్వహిస్తున్న ‘సేవా పఖ్‌వాడ’ కార్యక్రమంలో భాగంగా ఖత్‌ఖారీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం అపరిశుభ్రంగా ఉన్న స్కూల్‌ మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో క్లీన్‌ చేశారు. అంతేగాక ఈ వీడియోను ఆయన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ తదితర పార్టీ నేతలకు దీనిని ట్యాగ్‌ చేశారు.

మరోవైపు తానోకటి తలిస్తే.. దైవం మరోకటి తలచిందని.. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ కావడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. స్వచ్ఛాభారత్ అర్థాన్ని మార్చి.. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అనారోగ్యం, అపరిశుభ్రతను నేర్పిన ఎంపీ అంటూ కామెంట్లు వచ్చాయి. దీనికి తోడు ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను క్లీన్‌ చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఓవరాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ స్టంట్‌ అని, స్కూల్‌ పిల్లలతో టాయిలెట్‌ క్లీనింగ్‌ను కప్పిపుచ్చేందుకు ఆయన ఇలా చేశారంటూ పలువురు విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles