Monsoon withdrawal to begin in next two days: IMD మరో రెండు రోజల్లో నైరుతి రుతిపవనాలు తిరోగమనం: వాతావరణ శాఖ

Monsoon may finally start withdrawing in next three days says imd

monsoon season, indian weather, IMD data, Rain in Hyderabad, Rain in Telangana, yellow alert, telanagana, meteorological department, cyclonic, bay of bengal, upper air cyclonic circulation, Peddapalli, Jayashankar Bhupalpally, Mulugu, Bhadradri Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Medak, Warangal rural districts, heavy flood flow, musarambhag bridge close, hyderabad floods, musi floods

The southwest monsoon might finally start withdrawing from parts of North-West India over the next three days, signaling the end of its four-month journey over the country that started in June, IMD said. However, though the retreat might begin from next week, the rains might not descend quickly, as the met department predicted fresh spells of rains in Vidarbha, Chhattisgarh and east MP on September 21-22 and over Odisha, Coastal areas north Andhra Pradesh and Gangetic West Bengal on September 19-21.

మరో రెండు రోజల్లో నైరుతి రుతిపవనాలు తిరోగమనం: వాతావరణ శాఖ

Posted: 09/20/2022 01:49 PM IST
Monsoon may finally start withdrawing in next three days says imd

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడి దాని ప్రభావం చేత ఉత్తర కోస్తాలోని ఐదు జిల్లాలతో పాటు ఒడిశాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ రానున్న నాలుగు రోజులు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా హైదరాబాద్ లో మాత్రం వర్షం భారీగా కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపిన వాతావరణ శాఖ.. గ్రేటర్ నగరానికి ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. గడిచిన నాలుగు నెల్లలుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో.. చెరువులు, వాగులు, వంకలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి.

అయినా వరుణుడు శాంతించడం లేదు. నైరుతి రుతుపవనాల ప్రభావం ఓవైపు, ఉపరితల ఆవర్తన ద్రోణలు ప్రభావం.. వీటికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు, అల్పపీడనాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను భయకంపితుల్ని చేశాయి. కాగా తాజాగా భారత వాతావరణ శాఖ వెలువరించిన వార్త అధిక వర్షపాతాన్ని చవిచూసిన ప్రాంతవాసులతో పాటు లోతట్ట ప్రాంతాల ప్రజలకు ఊరటనిస్తోంది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభం కానుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతకుముందు దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అలాగే మరికొద్ది రోజుల్లో గాలిదిశ మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. తిరోగమనానికి ముందు రుతుపవనాలు మళ్లీ వాయువ్య ప్రాంతాలను తేమగా మార్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖంపడుతున్నాయి.

 రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబర్ 20 నాటికి దేశం నుంచి తిరోగమిస్తాయి. అక్టోబర్‌ వరకు చెదురుమదురు వర్షాలు అవకాశాలుంటాయి. రుతుపవనాలు ఈ నెల 27-28 మధ్య దేశ రాజధాని ఢిల్లీ నుంచి రుతుపవనాలు తిరోగమిస్తాయని స్కైమెట్‌ వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలో గాలి దిశ మారనుండడంతో.. మళ్లీ ఢిల్లీలో కాలుష్యం పెరిగే అవకాశం ఉన్నది. నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సగటు వర్షాపాతం కంటే 7శాతం ఎక్కువగా నమోదైంది. అయితే, యూపీ, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, త్రిపుర, మిజోరం, మణిపూర్‌లలో తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల 19 వరకు దేశంలో 872 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles