Seven killed, several injured in major fire accident in ev showroom సికింద్రాబాద్ ఈవీ వాహన షోరూమ్ లో అగ్నిప్రమాదం..

Seven killed several injured in major fire accident in electric bike showroom in secunderabad

Electrical Vehicles showroom, Electric vehicle battery blast, Electric vehicle battery explosion, Electric Vehicle charging, EV vehicles battery overnight charging, Ruby Lodge, Seven dead in Ruby lodge, Victim families, CM KCR ex-gratia, deceased families, ex-gratia to deceased familes, hospitalised victims, ex-gratia to injured, secundrabad fire accident, ruby hotel fire accident, Electric bikes battery blast, Secundrabad, Telangana, Crime

At least seven persons were killed and several others injured after a major fire broke out in an electric bike showroom at Secunderabad. The fire rapidly spread to the hotel located above the electric bike showroom, police said. Officials suspect a short circuit led to the fire. The vehicles in the parking area, showroom and basement caught fire resulting in thick smoke. The hotel staff and guests noticed the fire and smoke emanating and alerted the fire department.

సికింద్రాబాద్ ఈవీ వాహన షోరూమ్ లో అగ్నిప్రమాదం.. ఏడుగురు మరణం..

Posted: 09/13/2022 11:41 AM IST
Seven killed several injured in major fire accident in electric bike showroom in secunderabad

సి‌కింద్రాబాద్ లోని ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో సొమవారం రాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ వాహన షోరూం పైనున్న రూబీ లాడ్జీలోని హోటల్ సిబ్బందితో పాటు గదులు తీసుకున్న అతిధిల్లో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారిన కొందరు భవనం పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాగా వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ లాడ్జీ సెల్లార్ లోని ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆపై అవి దానిపైన ఉన్న లాడ్జిలోకి వ్యాపించాయి.

సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయ సమీపంలో ఓ ఐదంతస్తుల భవనంలో పొగ దట్టంగా వ్యాపించడంతో లాడ్జీలోని కొందరు పర్యాటకులు ఊపిరాడక ఎక్కడికక్కడ స్పృహతప్పి పడిపోయారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో విజయవాడకు చెందిన ఎ.హరీశ్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్టు గుర్తించారు. మిగిలిని వారిని గుర్తించే పనిలో ఉన్నారు.

ఇందులోని నాలుగు అంతస్తుల్లో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్‌లో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమును నిర్వహిస్తున్నారు. గత రాత్రి 9.40 గంటల సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనాల్లోని బ్యాటరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో.. వాహనాలు అంటుకుని మంటలు భయానకంగా ఎగసిపడ్డాయి. ఆపై పై అంతస్తులకు వ్యాపించాయి. దీనికి తోడు దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు, మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గంలేని పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. రక్షించమని కేకలు వేశారు.

ఈ సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. తప్పించుకునే మార్గం కనిపించకుండా పోయింది. ఇంకోవైపు పొగ దట్టంగా కమ్మేయడంతో ఊపరి ఆడక పర్యాటకులు స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు అంటుకుని నలుగురు చనిపోయారు. కిందికి దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోటల్ గదుల్లో చిక్కుకున్న వారిని హైడ్రాలిక్ క్రేన్ సాయంతో రక్షించారు.

క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించే అవకాశం ఉండడంతో వాటిని ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న తదితరులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles