Harbhajan Singh helps Bathinda girl, held captive in Oman ఒమన్‌లో చిక్కుకుపోయి.. భజ్జీ సాయంతో భారత్ చేరిన యువతి..

Former indian cricketer harbhajan singh helps rescue girl held captive in gulf country

Harbhajan Singh, Harbhajan Singh news, Harbhajan Singh did a noble deed of rescuing a Bhatinda girl from Oman, Harbhajan Singh Kamaljeet Kaur, Harbhajan Singh Indian embassy in Oman, punjab MP, aam admi party MP, Rajya sabha member, parliamentarian, Punjab, Politics

Former Indian off-spinner Harbhajan Singh in his second innings as a public representative, he did a noble deed of rescuing an Indian girl from a foreign land, who was held captive by her fraudulent employers. Harbhajan, with the help of Government of India and Indian embassy in Oman helped rescue 21-year-old Kamaljeet Kaur from Bhatinda, after her father got in touch with the Aam Aadmi Party (AAP) leader through his uncle's acquaintance.

ఒమన్‌లో చిక్కుకుపోయి.. భజ్జీ సాయంతో భారత్ చేరిన యువతి..

Posted: 09/08/2022 06:28 PM IST
Former indian cricketer harbhajan singh helps rescue girl held captive in gulf country

టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాట్స్ మెన్లను తన స్పిన్ బంతులతో వెనక్కి పంపించడం తెలిసిందే. అయితే ఆయన అప్పుడప్పుడూ అవేశాలకు కూడా త్వరగానే లోనవుతుంటారన్న విషయం కూడా తెలిసిందే. అస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆండ్రూ సైమండ్స్ స్లెడ్జింగ్ తో ఆయనకు ఏర్పడిన వైరం.. ఎక్కడి వరకు దారి తీసిందో కూడా క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. అయితే అవేశం ఎక్కువన్న విషయాన్ని పక్కనబెడితే.. మనస్సుకు తాకిన విషయాలపై కూడా ఆయన అంతే త్వరగా స్పందిస్తారన్న విషయం తాజాగా జరిగింది. అయితే ఏ విషయాన్ని అంత సులువుగా వదలని ఆయన వాటిలో పరిష్కారం లభించేవరకు పోరాడుతుంటారు.

తాజాగా అదే జరిగింది. మొన్నటివరకు కేవలం క్రికెటర్ మాత్రమే ఆయిన ఆయన ఇటీవలే పార్లమెంటు సభ్యుడు కూడా అయిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను ఏకంగా రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఆయన పరిష్కరించడంలోనూ ముందున్నారు. ఈ క్రమంలో ఆయన తన మంచి మనసు చాటుకున్నారు. మోసగాళ్ల మాయమాటలు నమ్మి ఏడాది దేశానికి కుటుంబపోషణ కోసం బయలుదేరి వెళ్లిన ఓ నిరుపేద యువతికి వెట్టి నుంచి వారి వేతల నుంచి విముక్తి కల్పించారు.

మోసగాళ్ల బారినపడి గల్ఫ్‌లో చిక్కుకుపోయిన నిరుపేద యువతిని క్షేమంగా ఇంటికి చేరుకుంది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని బఠిండా జిల్లా బార్‌కండి గ్రామానికి చెందిన సికందర్‌సింగ్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు కాగా, పెద్దమ్మాయి కమల్జీత్ కౌర్ (21) తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది. కుటుంబానికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానిక ఏజెంటును ఆశ్రయించింది. అక్కడ ఓ భారతీయ కుటుంబంలో పనికి కుదుర్చుతామని చెప్పి ఆమెను గత నెలాఖరులో ఒమన్ రాజధాని మస్కట్ పంపించాడు.

అక్కడి విమానాశ్రయంలో ఓ ఏజెంట్ ఆమెను కలిసి నేరుగా ఫలజ్ అల్ ఖబైల్ అనే ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడకు చేరగానే కమల్జీత్ పాస్‌పోర్టు, సిమ్‌కార్డు లాక్కున్నారు. అక్కడ మరో 20 మంది వరకు భారతీయ మహిళలు ఉన్నట్టు కమల్జీత్ తెలిపింది. అక్కడ ఆమె నుంచి పాస్‌పోర్ట్, సిమ్‌కార్డ్ లాక్కున్న వారు కమల్జీత్‌తో బలవంతంగా బురఖా తొడిగించారు. ఆపై అరబిక్ భాష నేర్చుకోవాలని ఆదేశించారు. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించిన కమల్జీత్ ఎలాగోలా కొత్త సిమ్‌కార్డ్ సంపాదించి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈ విషయం తెలిసిన అక్కడున్న వారు ఆమెను కర్రతో చితకబాదారు.

మరోవైపు, గల్ఫ్‌లో చిక్కుల్లో పడిన కుమార్తెను వెనక్కి రప్పించుకునేందుకు తండ్రి సికందర్ ఇంటిని తాకట్టుపెట్టి స్థానిక ఏజెంట్‌కు రూ. 2.5 లక్షలు ఇచ్చాడు. విషయం తెలిసిన రాజ్యసభ సభ్యుడు, మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయ సిబ్బందితో మాట్లాడి కమల్జీత్ కౌర్‌ను రక్షించాల్సిందిగా కోరారు. వారు వెంటనే స్పందించి కమల్జీత్‌ను రక్షించారు. ఈ నెల 3న ఆమె మస్కట్ నుంచి ఇండియా చేరుకుంది. అక్కడ తనలానే ఎంతోమంది భారతీయ యువతులు చిక్కుకుపోయారని, వారందరినీ రక్షించాలని కమల్జీత్ ప్రభుత్వాన్ని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles