viral video: Waterspout occurs in Singur project at Sangareddy వరుణ దేవుడి దాహం తీర్చిన మంజీరా నది..

Waterspout occurs in singur project at sangareddy video goes viral

Tornado in Manjeera river, Tornado in singur project, waterspout in singur project, waterspout in manjeera river, waterspout viral video, Tornado viral video, no damage during waterspout, no damage during Tornado, Manjeera river, Singur project, Sangareddy, waterspout, social media, netizens, Tornado, No damage, Telangana News, viral video

A video of a waterspout at the Singur project in Sangareddy is going viral on social media and shocking the netizens. Many people term it as a Tornado which destroys structures, uproots trees and hurls objects and completely damages the area. But, the waterspout that occurred at the Singur project didn't report any damage but shocked the villagers.

ITEMVIDEOS: సంగారెడ్డిలో సంభ్రమాశ్చర్యం: వరుణ దేవుడి దాహం తీర్చిన మంజీరా నది..

Posted: 09/05/2022 06:52 PM IST
Waterspout occurs in singur project at sangareddy video goes viral

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సంభ్రమాశ్చర్యకర దృశ్యం కనువిందు చేసింది. అరుదైన దృశ్యాలు మెరుపు వేగంతో సంభవించి అదృశ్యమైవుతుంటాయి. కానీ ఇక్కడ అవిష్కృతమైన దృశ్యం ఏకంగా మూడు నిమిషాల పాటు కొనసాగింది. స్థానికులు ఈ అసక్తికర దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించుకునేంత వరకు చోటుచేసుకుంది. ఈ దృశ్యం చూడటానికి అచ్చంగా అగ్రరాజ్యంలో సంభవించే టోర్నడో తరహాలోనే ఉందని స్థానికులు చెబుతున్నా.. అసలు జరిగిన విషయం మాత్రం వేరే. ఏం జరిగిందనేగా.. భూమి మీద వున్న జలాశయాలు, చెరువులు, బావులు, కాలువలు, వాగులు, వంకలు.. చివరికి జీవనాధారమైన నదులు నిండాలన్నా వరుణ దేవుడి కృపాకటాక్షాలు కావాల్సిందే.

వరుణుడు ఒక్క ఏడాదికి కావాల్సినంత వర్షం కురిపిస్తే తప్ప.. భూమిపై సకలజీవరాశులకు ఉపశమనం లేదు. ఎందుకంటే నీరు లేకుండా ఏ ప్రాణి మనుగడైనా కష్టసాధమే. తండ్రి లాంటి వరుణ దేవుడికి జలాశయాలు పిలల్లు లాంటివే. అయితే తండ్రి బాధ్యతగా పిల్లలను ఎలా పాలన చేస్తోడో.. అదే విధంగా ఒక్కో సారి పిల్లలు కూడా తండ్రుల పట్ల అంతే ప్రేమ, ఆప్యాయలతో వ్యవహరించడం సాధారణ విషయమే. అయితే ప్రకృతి పరంగా ఈ ప్రేమాప్యాయత దృశ్యాలు స్మార్ట్ ఫోన్లకు చిక్కడం అరుదైన విషయం. సంగారెడ్డిలో జరిగిన విచిత్రమైన దృశ్యం ఏమంటే.. ఏకంగా వరుణ దేవుడికే మంజీరా నది నీళ్లు తాగించింది. టోర్నోడా భావించినా.. ఇది వాటర్ స్పౌట్ అని.. ఇది ఏర్పడటంతో నదిలోని నీళ్లు మేఘాలకు చేరాయి.

అయితే టోర్నోడో అత్యంత భయానకం. చెట్లు, పుట్టులు, ఇళ్లు కట్టడాలు అన్న తేడా లేకుండా ఏకంగా అన్నింటినీ పీకి పందిరేస్తుంది. కానీ వాటర్ స్పౌట్ మాత్రం అలాకాకుండా కేవలం కొన్ని నిమిషాల పాటు నీళ్లును తీసుకుని ఎలాంటి నష్టం లేకుండా అదృశ్యమైంది. టోర్నోడో వార్తల నేపథ్యంలో హడలెత్తిపోయిన స్థానికులు.. వాటర్ స్పౌట్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వట్​పల్లి మండలం సింగూరు జలాశయంలో చోటు చేసుకుంది. దేవునూర్, నిర్జప్లా గ్రామాల మధ్య సింగూర్ నీటిలో టోర్నడో ఏర్పడింది. ఆకాశానికి భూమికి మధ్య సుడిగుండంలా నీళ్లు సుడులు తిరుగుతూ మేఘాల్లోకి వెళ్లాయి. ఈ ఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles