IRCTC's tourism package to Gujarat from Hyderabad హైదరాబాద్ టు ద్వారక, సోమ్‌నాథ్‌ - టూర్ తేదీ, ధరలివే

Irctc unveils sundar saurashtra pilgrim tourist packages to gujarat fron hyderabad

irctc tourism, irctc tourism latest plans, gujarat hyderabad tour, hyd gujarat irctc tour, sundar saurashtra irctc tour, hyderabad to gujarat, IRCTC Vibrant Gujarat Tour, IRCTC Gujarat Tour, IRCTC tourism, IRCTC tour package from Hyderabad, IRCTC tour package from hyderabad, hyderabad to saurashtra, irctc, hyderabad to dwaraka, hyderabad to somnath, sundar saurashtra, dwaraka, somnath, gujarat tour

IRCTC tourism announced another Gujarat Tour from Hyderabad to Statue of Unity, after Vibrant Gujarat from Vijayawada, Now Sundar Saurashtra Tour package from Hyderabad Know package details

సుందర్ సౌరాష్ట్ర: హైదరాబాద్ టు ద్వారక, సోమ్‌నాథ్‌ - టూర్ తేదీ, ధరలివే

Posted: 09/01/2022 06:46 PM IST
Irctc unveils sundar saurashtra pilgrim tourist packages to gujarat fron hyderabad

వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సుందర్ సౌరాష్ట్ర పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు యాత్ర ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అహ్మదాబాద్, ద్వారక, రాజ్ కోట్, సోమ్‌నాథ్‌, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

1వ రోజు బుధవారం: ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకు పోరుబందర్ ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
2వ రోజు గురువారం: ఉదయం వడోదర స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి వెళ్లిన తర్వాత... స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శిస్తారు. రాత్రి వడోదరలోనే బస చేస్తారు.
3వ రోజు శుక్రవారం: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కు వెళ్తారు. ఆ తర్వాత అహ్మాదాబాద్ కు పయనమవుతారు. అక్కడ ఉన్న అక్షరదామం ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి అహ్మాదాబాద్ లోనే బస చేస్తారు.
4వ రోజు శనివారం: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... సబర్మతి ఆశ్రయంకు చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్ కోట్ కు వెళ్తారు. మధ్యాహ్నం హెటల్ కి వెళ్లిన తర్వాత... వ్యాస్టన్ మ్యూజియంను సందర్శిస్తారు. గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి రాజ్ కోట్ లోనే బస చేస్తారు.
5వ రోజు ఆదివారం: హోటల్ నుంచి ద్వారకా చేరుకుంటారు. ఆ తర్వాత జామ్ నగర్ కు వెళ్తారు. తిరిగి ద్వారకకు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేస్తారు.
6వ రోజు సోమవారం: ద్వారకాదిశ్ ఆలయానికి వెళ్తారు. చెక్ అవుట్ అయిన తర్వాత... సోమ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సమయానికి పోరుబందర్ కు చేరుకుంటారు. రాత్రి వరకు పోరుబందర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.7వ రోజు మంగళవారం: అర్ధరాత్రి 12.20 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ బయల్దేరుతుంది.
8వ రోజు బుధవారం: ఉదయం 08.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ధరల విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 51,570 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 28,830 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.22,230 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. కాగా, ఈ పర్యటనలో స్లీపర్ క్లాస్ లో సింగిల్ ఆక్సుపెన్సీకి 48770 ధర నిర్ణయించగా, డబుల్ ఆక్యుపెన్సీకి 26030, త్రిపుల్ ఆక్యుపెన్సీకి 19440 ధరను ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles