Six held for ‘fake IT raid’ on jewellery shop in AP నెల్లూరు జ్యువెలర్స్ షాపులో నకిలీ ఐటీ అధికారులు..

Police arrest fake ed officers conducting raid on jewellery shop in nellore

Fake IT officials, surya film Gang, masquerading as income tax officials, fake IT officials in Nellore, fake IT raids in Lavanya Jewellers, Fake IT raids Kakarla Vidhi Nellore, Gold Ornaments, Six held, fake IT raid, jewellery shop, Nellore, Andhra Pradesh, crime

Six people were arrested on charges of masquerading as income tax officials and raiding a jewellery shop in Nellore on Friday. The shop owner grew suspicious and alerted the police, when the imposters were trying to leave the shop after packing gold ornaments worth over ₹1.50 crore.

నెల్లూరులో నకిలీ ఐటీ అధికారులు.. లావణ్య జ్యువెలర్స్ లో.. సూర్య గ్యాంగ్ సీన్..

Posted: 08/26/2022 09:10 PM IST
Police arrest fake ed officers conducting raid on jewellery shop in nellore

ఆదాయపన్నుశాఖకు చెందిన అధికారులకు ఉండే ప్రత్యేకమైన అధికారాలను కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ.. నకిలీ ఐటీ అధికారుల అవతారం ఎత్తుతున్నారు. సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలో క్లైమాక్స్ లో కథ మలుపుతిప్పే సీన్ ను కేటుగాళ్లు నిజంగా రిపీట్ చేసినా.. వారి నటనా కౌశల్యంలో చివరి నిమిషంలో అనుమానం వచ్చిన యజమాని అప్రమత్తం కావడంతో.. పట్టుబడిన నకిలీలు చివరకు ఊచలు లెక్కపెడుతున్నారు. ఏకంగా సినిమాలో మాదిరిగానే వీరు కూడా ఓ బంగారు ఆభరణాల దుకాణన్నే టార్గటె్ చేయడం విశేషం.

నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని కాకర్లవారి వీధిలో ఉన్న లావణ్య జ్యువెలర్స్‌లో భారీ చోరీకి స్కెచ్‌ వేసిన దొంగలు పన్నాగం పారక కటకటాల పాలయ్యారు. సుమారు 6 గురు సభ్యులు గల ముఠా దర్జాగా కారులో వచ్చి తాము ఐటీ అధికారులమంటూ దుకాణంలో చొరబడ్డారు. వచ్చిరావడంతోనే దుకాణంలోని మార్గాలను అన్నింటినీ బ్లాక్ చేసి.. ఫోన్లు కూడా మాట్లాండేందుకు వీలు లేకుండా అచ్చంగా ఒరిజినల్ ఆదాయపన్నుశాఖ అధికారుల మాదిరిగానే చేశారు. దుకాణానికి సంబంధించిన లావాదేవీల పుస్తకాలు చూపించాలని నగల షాపు యజమానిని బెదిరించారు.

యజమాని బంగారం తాలుకు రశీదులను చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అధికారుల దృష్టి మాత్రం నగలపైనే పడింది. ఎలాగైనా షాపు నుంచి ఆభరణాలను తస్కరించాలని స్కేచ్ లో భాగంగా వారు దుకాణంలో ఉన్న 12 కిలోల బంగారాన్ని మూట కట్టించారు. కానీ యజమాని చూపుతున్న రశీదులను ససేమిరా పట్టించుకోలేదు. అయితే ఈ ప్రవర్తనే యజమానికి అనుమానాలను రేకెత్తించింది. ఐటీ అధికారులు వ్యవహరించే విధంగా కాకుండా భిన్నంగా ఉండడంతో వారిని ఒక గదిలో బంధించి మూడవ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles