భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందన్న విషయం తరగతి విద్యార్థలు నుంచి అందరికీ తెలిసిందే. అయితే ఆ గురుత్వాకర్షణ శక్తి ఇప్పుడేమైనా తగ్గిందా.? అన్న అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకలా.? అంటే గాల్లో ఉన్న ఓ విమానం అలా ఆకాశంలో ఆగిపోయింది. గాలిలో తేలియాడుతున్నది. అయినా ఏ మాత్రం భూమి గురుత్వాకర్షణ శక్తికి కిందకు రాకుండా అది గాల్లోనే ఉంది. అలా కొంత సమయం పాటు అలానే గాల్లో తేలియాడుతూ ఉండటం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఔరా అలా ఎలా విమానం గాల్లో నిలిచిపోయిందని వింతగా చూశారు.
గాల్లో విమానం ఉందంటే రైయ్ రైయ్ అంటూ దూసుకుపోతుంది. కనురెప్పి మూసితెరిచే లోగా వేగంగా తన పయనాన్ని సాగించే విమానం.. ఏ మాత్రం కదలకుండా అలా నిలిచిపోయింది. ఈ వింతను చూసిన టిక్ టాకర్లు, యూట్యూబర్లు తమ సెల్ ఫోన్లకు పనిచెప్పారు. ఈ వింతను గ్లిట్చస్ ఇన్ ది మాట్రిక్స్ అంటూ తమ కెమెరాల్లో బంధించారు. ఈ క్లిప్ టిక్‌టాక్‌లో వైరల్ అయ్యింది. అనంతరం అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై చక్కర్లు కొట్టింది. కారులో వెళ్తున్న వ్యక్తి ఈ విమానాన్ని వీడియో తీశాడు.
తాను కారులో ముందుకు కదులుతున్నానని, కానీ, విమానం ఆకాశంలో అక్కడే ఉండిపోయిందని వీడియోలో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇలాంటి దృగ్విషయం కెమెరాకు చిక్కడం, నెటిజన్లను షాక్‌కు గురిచేయడం ఇదే మొదటిసారి కాదు. ‘వైరల్హగ్’ షేర్ చేసిన మరో వీడియోలో కదులుతున్న కారులో కూర్చున్న వ్యక్తి వ్యతిరేక దిశలో వెళ్తున్న విమానాన్ని బంధించాడు. ఆ విమానం ఏ మాత్రం కదలడం లేదు. డల్లాస్/ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇలాంటి వీడియో ఒకటి వెలుగుచూసింది.
ఈ వీడియో 2018లో యూట్యూబ్‌లో కనిపించింది. అయితే, దీని వెనుక సైన్స్ దాగి ఉందని నిపుణులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆకాశంలో చిక్కుకున్నట్టు కనిపించే విమానాలు ‘ఆప్టికల్ ఇల్యూజన్’ అని తెలిపారు. ‘విమానాలు తరచూ ఎదురుగాలి, టెయిల్ విండ్ గుండా వెళ్తాయి. ఒక టెయిల్విండ్ విమానం దిశలో వీస్తున్నప్పుడు, విమానం కదిలే దిశకు వ్యతిరేకంగా ఎదురుగాలి వీస్తుంది. చాలా బలమైన ఈదురు గాలుల కారణంగా విమానాలు గాల్లోనే ఆగిపోయినట్టు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి చాలా చాలా నెమ్మదిగా కదులుతాయి.’ అని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more