వ్యాపారం సక్రమంగా సాగడం లేదని ఓ వ్యాపారి అక్రమ మార్గాలను అన్వేషించాడు. కాగా, నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరదండాలు వేశారు. డబ్బులతోనే సమస్య అనుకున్న ఈ కేటుగాళ్లు డబ్బులనే తయారు చేయడానికి సిద్దమయ్యారు. ఏకంగా నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మీర్ చౌక్పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2.50 లక్షలు విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. పురాణిహవేలిలోని సౌత్‌జోన్ డీసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సౌత్జోన్డీసీపీ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షాకిర్ స్థానికంగా ఎన్ఎస్ కంప్యూటర్, జిరాక్స్ సెంటర్‌ను నడుపుతున్నాడు. సంపాదన సరిపోవకపోవడంతో అడ్డదారులను వెతికాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నకిలీ కరెన్సీని తయారు చేసి మార్కెట్లో చలామణి చేయాలని పథకం వేశాడు.
ఈ నేపధ్యంలోనే తన బంధువైన మహారాష్ట్ర లాథూర్జిల్లా ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన సయ్యద్అన్సార్(27)ను ఎంచుకున్నాడు. సయ్యద్అన్సార్సహకారంతో హైదరాబాద్పాతబస్తీ వట్టేపల్లి ఫారూక్నగర్కు చెందిన షేక్ ఇమ్రాన్(33)ను కూడా నకిలీ కరెన్సీని చలామణికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో 8 వేల ఒరిజినల్కరెన్సీకి 50 వేల నకిలీ కరెన్సీ ఇస్తున్నాడు. దీంతో నకిలీ కరెన్సీని తీసుకున్న సయ్యద్ అన్సార్ వాటిని రూ. 15 వేలకు షేక్ ఇమ్రాన్‌కు అందిస్తున్నాడు. ఇక షేక్ ఇమ్రాన్ నకిలీ నోట్లను హైదరాబాద్ నగరం పాటు ఇతర ప్రాంతాలలో చలామణి చేస్తున్నారు.
విశ్వనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అడీషనల్ డీసీపీ స్నేహ ఆధ్వర్యంలో మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజిబిఎస్ అవుట్గేట్ వద్ద దాడులు నిర్వహించారు. నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న సయ్యద్ అన్సార్‌తో పాటు షేక్ ఇమ్రాన్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువ గల రూ. 100, 200, 500, 2000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న షాకేర్కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసును మీర్‌చౌక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more