BCG vaccine for tuberculosis protects diabetics from COVID-19: Study షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ..

The bcg vaccine against covid 19 and other infectious diseases in type 1 diabetic adults

Bacillus Calmette-Guerin (BCG), BCG vaccines, Tuberculosis, COVID vaccine, Massachusetts General Hospital (MGH), Cell Reports Medicine, coronavirus, Covid-19

A widely used tuberculosis vaccine protected people with Type 1 diabetes from COVID-19, according to a study that demonstrates the potential of multiple doses of the Bacillus Calmette-Guerin (BCG) preventive against SARS-CoV-2 and other viruses. The study, published in the journal Cell Reports Medicine, was conducted on 144 patients with type 1 diabetes at the start of the pandemic, much before COVID-specific vaccines were available.

షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ..

Posted: 08/17/2022 12:42 PM IST
The bcg vaccine against covid 19 and other infectious diseases in type 1 diabetic adults

మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు మాత్రం విజయాన్ని అందుకునే క్రమంలో అసువులు బాసారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులలో కరోనా బారిన పడకుండా అడ్డుకట్ట వేసే విషయంలో పరిశోధకులు మరో ముందడుగు వేశారు. క్షయ నివారణకు వాడే బీసీజీ టీకాతో టైప్-1 డయాబెటిస్ రోగుల్లో కొవిడ్‌ నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని తేల్చారు. మరీ ముఖ్యంగా ఈ వాక్సీన్ తో టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా పెద్ద ఉపశమనం లభించినట్లు అయ్యింది.

టైప్ 2 డయాబిటీస్ ఉన్నవారికి మార్కెట్లో లభిస్తున్న టీకాలు రక్షణగా నిలుస్తుండగా, టైఫ్-1 రోగులకు మాత్రం బిసిజీ టీకా రక్షణ కవచంలా నిలుస్తోంది. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసపత్రి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు వైరస్ నివారణకే పరిమితం అవుతుండగా, బీసీజీ టీకాను పలు మోతాదుల్లో ఇవ్వడం ద్వారా కరోనాతోపాటు వైరస్‌ వల్ల సంక్రమించే ఇతర అంటువ్యాధులకు చెక్ పడుతుందని తేలింది. 144 మంది టైప్-1 డయాబెటిస్ రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధనలో కరోనాపై బీసీజీ టీకా 92 శాతం సామర్థ్యం చూపించింది.

నిజానికి రోగ నిరోధకశక్తి చాలా తక్కువగా ఉండే టైప్-1 మధుమేహ రోగులకు కరోనా సోకితే అది ప్రాణాల మీదకు వస్తుంది. పరిశోధనలో పాల్గొన్న మధుమేహ రోగులకు కరోనా సోకడానికి ముందు బీసీజీ టీకాను మూడు డోసులు ఇవ్వగా, అవి వారికి కరోనా నుంచి రక్షణ కవచంగా నిలిచినట్టు మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకుడు డెవిస్ ఫౌస్ట్‌మన్ తెలిపారు. ఈ టీకా వల్ల ప్రతికూల ఫలితాలేమీ కనిపించలేదన్నారు. టీకా ఆలస్యంగా ప్రభావం చూపినా దీర్ఘకాలం రక్షణగా నిలుస్తుందన్నారు. అంతేకాదు, కొవిడ్ కొత్త వేరియంట్లపైనా ఇది ప్రభావం చూపిస్తుందని ఫౌస్ట్‌మన్ తెలిపారు. క్షయ రోగ నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 కోట్ల మంది బాలలకు ఈ టీకా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles