110-feet wide colossal asteroid coming towards Earth భూమిపైకి దూసుకోస్తున్న మూడు ప్రమాదకర అస్టరాయిడ్స్..

Nasa says potentially hazardous asteroid to make its closest approach to earth on aug 13

NASA,asteroid,Earth,asteroid nasa,NASA asteroid,asteroid earth,asteroid strike,asteroids,asteroids Earth,earth asteroid,asteroid near earth,asteroid impact,asteroids nasa,nasa earth,near Earth objects,NEO asteroids,NEO,asteroid passing,asteroid tracking,CNEOS,Jet Propulsion Lab,NASA JPL,2022 OT1

NASA says that the asteroid 2022 OT1 is moving towards the Earth at a very high speed and is expected to make its closest approach to the planet on August 13. It appears that Earth is facing some massive asteroids over the recent times. Last week, we had a couple of 45 and 55-feet wide asteroids coming towards the Earth and yesterday a dangerous 100-feet wide asteroid narrowly missed our planet. And now, NASA confirms that a 110-feet wide city-killer asteroid will be making a close approach to the Earth on August 13.

భూమిపైకి దూసుకోస్తున్న మూడు ప్రమాదకర అస్టరాయిడ్స్.. నాసా హెచ్చరికలు

Posted: 08/12/2022 08:27 PM IST
Nasa says potentially hazardous asteroid to make its closest approach to earth on aug 13

అంత‌రిక్షంలో గ్ర‌హ శ‌క‌లాల (ఆస్ట‌రాయిడ్స్) ప్ర‌యాణం సాధార‌ణ‌మే. అయితే ఆస్ట‌రాయిడ్స్ నుంచి భూమికి ముప్పు ముంచుకువ‌స్తోందా? అంటే అవుననే అంటోంది అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌ నాసా. కాగా భూమి వైపున‌కు కొన్ని శ‌క‌లాలు దూసుకురావ‌డం కూడా స‌హ‌జ‌మే. అరుదైన సంద‌ర్భాల్లో మాత్ర‌మే అవి భూమిని ఢీ కొన్నాయి. చిన్న ప‌రిమాణంలో ఉన్న శ‌క‌లాలు భూవాతావ‌ర‌ణంలోనే అంత‌మ‌వుతాయి. రానున్న ఐదు రోజుల్లో క‌నీసం ఐదు గ్ర‌హ శ‌క‌లాలు భూమి వైపు దూసుకురానున్నాయ‌ని తాజాగా హెచ్చ‌రించింది.

రానున్న ఐదు రోజుల్లో.. ఐదు గ్ర‌హశ‌క‌లాల్లో మూడు భారీ ప‌రిమాణంలో ఉన్న అస్టరాయిడ్స్ భూమిపైకి దూసుకువస్తున్నాయి. అవి దాదాపు పెద్ద సైజు విమానం అంత ఉన్నాయ‌ని నాసా వెల్ల‌డించింది. వీటిలో అతి పెద్ద గ్ర‌హ శ‌క‌లానికి 2022 OT1 అని పేరు పెట్టారు. ఇది 110 అడుగుల వెడల్పు ఉంది. ఇది ఆగ‌స్ట్ 14 ఆదివారం తెల్ల‌వారుజామున సెక‌నుకు 5.7కిమీల వేగంతో భూమి నుంచి 4.7 మిలియ‌న్ కిమీల దూరం నుంచి దూసుకువెళ్ల‌నుంది. ఒక‌వేళ ఈ గ్ర‌హ శ‌క‌లం భూమిని ఢీ కొంటే ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ న‌గ‌ర‌మంత పెద్ద గొయ్యి ఏర్ప‌డుతుంది. అయితే, ఈ గ్ర‌హ శ‌క‌లాల వ‌ల్ల భూమికి త‌క్ష‌ణ‌మే వ‌చ్చే ముప్పేమీ లేద‌ని నాసా తెలిపింది.

భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే మ‌రో గ్ర‌హశ‌క‌లం 2022 పీకే1. ఇది దాదాపు 100 అడుగుల వెడల్పు ఉంది. ఇది భూమి నుంచి 5.2 కిమీల దూరంలో ఉండ‌గా మ‌న గ్ర‌హాన్ని దాట‌నుంది. మిగ‌తా గ్ర‌హశ‌క‌లాల్లో.. 2015 ఎఫ్ఎఫ్ 53 అడుగులు, 2022 జీరోఏ4 71 అడుగులు, 2022 పిడబ్యూ 93 అడుగుల వెడ‌ల్పు ఉన్నాయి. వీటిలో 2022 పిడబ్యూ ఆగ‌స్ట్ 16న‌, 2015 ఎఫ్ఎఫ్ ఆగ‌స్ట్ 12న భూ గ్ర‌హాన్ని దాటేయ‌నున్నాయి. నాసా ఆస్టరాయిడ్ వాచ్ భూమి నుండి 7.5 మిలియన్ కిలోమీటర్ల లోపు వచ్చే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేస్తుంది, ఇది భూమి, చంద్రుని మధ్య దూరం కంటే 19.5 రెట్లు ఎక్కువ. ఆ దూరంలోపు ఆ ప‌రిమాణంలో ఉన్న వ‌స్తువుపై భూ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి ప‌నిచేస్తుంది. ఆ వ‌స్తువును భూమి ఆక‌ర్షిస్తే అత్యంత దారుణ ప‌రిణామాలు సంభ‌విస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles