UP constable`s video over `poor quality mess food` పశువులు కూడా ఈ బోజనం తినవంటూ ఏడ్చేసిన కానిస్టేబుల్

Up police orders probe after constable s video over poor quality mess food goes viral

Manoj Kumar, Firozabad cop, food quality complaint, Constable complaint over food, UP police constable protest, bad-quality food, CM Chief Minister Yogi Adityanath, Shesh Paul Vaid, former DGP of J&K, UP constable viral video, poor food quality, Firozabad, Uttar Pradesh Police,UP constable viral video, poor food quality, Firozabad police constable, Firozabad news, Firozabad police, Twitter, Social Media, Firozabad, Uttar Pradesh police

The Firozabad Police in Uttar Pradesh have clarified that a probe has been ordered into the complaint made by the constable about poor quality food. The probe will be conducted by the Circle Officer (city). The video of the police constable crying in the middle of the road with a plate of food has gone viral on social media.

ITEMVIDEOS: పశువులు కూడా ఈ బోజనం తినవంటూ ఏడ్చేసిన కానిస్టేబుల్

Posted: 08/12/2022 01:48 PM IST
Up police orders probe after constable s video over poor quality mess food goes viral

ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో అమలుకు మధ్య ఎంతో తేడా ఉంటుందన్నది కాదనలేని వాస్తవమని ఈ కానిస్టేబుల్ చెబుతున్న మాటల్లో మారుమారో బహిర్గతం అయ్యింది. ఆ మధ్య ఆర్మీలోని ఓ జవాను తమకు నీళ్ల చారు.. కాలీ కాలని రోట్టెలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ వీడియో విడుదల చేయగా, అతడు మతి స్థిమితం లేని వ్యక్తి అని ముద్రవేసి సర్వీసు నుంచి కూడా తోలగించారు.

కాగా తాజాగా అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లోనూ వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లో పోలీసుల దయనీయ పరిస్థితి బయటపడింది. మెస్‌ ఫుడ్‌ నాణ్యతపై ఒక కానిస్టేబుల్‌ బోరున విలపించాడు. తమకు ఇచ్చే ఆహారాన్ని జంతువులు కూడా తినలేవని ఆరోపించాడు. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్‌ మనోజ్ కుమార్ అక్కడి మెస్‌ ఫుడ్‌పై ఆవేదన వ్యక్తం చేశాడు. రోటీలు, దల్‌ ప్లేట్‌ పట్టుకున్న అతడు దానిని అక్కడున్న వారికి చూపించి బోరున విలపించాడు. రోటీలను సరిగా కాల్చలేదని, పప్పు నీళ్ల లాగా ఉందని, అన్నం ఉడకలేదని ఆరోపించాడు.

పోలీసు సిబ్బందికి పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న భృతిని  దాదాపుగా 30శాతం మేర పెంచినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గతంలో ప్రకటించారంటూ కానిస్టేబుల్‌ మనోజ్ కుమార్ గుర్తు చేశాడు. అయితే దాదాపుగా తమతో 12 గంటలు డ్యూటీ చేయించుకున్న తర్వాత తమకు లభించే అహారం కాలీకాలని రోట్టెలు, పప్పు అని చెప్పాడు. పోలీస్ శాఖ అందించే ఆహారాన్ని జంతువులు కూడా తినలేవంటూ విమర్శించాడు. సరైన ఆహారం లేకపోతే పోలీసులు ఎలా డ్యూటీ చేస్తారు? అని ప్రశ్నించాడు. మెస్‌ ఫుడ్‌ నాణ్యతను ప్రశ్నించినందుకు జాబ్‌ నుంచి తొలగిస్తామంటూ తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు.

అయితే తన అవేధనను వ్యక్తం చేసిన ఆ కానిస్టేబుల్.. తన బాధను ఇన్నాళ్లు పంటికింద బిగపట్టుకున్నాడో ఏమో కానీ.. ఏకంగా మీడియా ముందు బోరున విలపించాడు. అయితే రోడ్డు మీద తమాషా చేయడం ఎందుకు మీ బాధను ఉన్నాతాధికారులతో పంచుకుందువు గానీ రా అంటూ.. అక్కడున్న పోలీస్‌ అధికారి సముదాయించేందుకు ప్రయత్నం చేశాడు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఫిరోజాబాద్ పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్‌ మనోజ్ కుమార్‌ తరచుగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అతడి అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించి గతంలో 15 సార్లు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles