Telangana receives 80 cm rains as against 43 cm average రాష్ట్రంలో ఈ నెల 13 వరకు తేలికపాటి వర్షాలు

Telangana state to receive light to moderate rainfall till 13 august

light rain, telangana, average rainfall, large excess rainfall, excess rainfall, seven districts of Telangana, India Meteorological Department (IMD), red alert to Adilabad, red alert to Kumram Bheem Asifabad, red alert to Mancherial, red alert to Nirmal, red alert to Jagtial, red alert to Jayashankar Bhupalpally, orange alert to seven districts of Telangana, Nizamabad, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Mulugu, Bhadradri Kothagudem, Siddipet districts, Yellow alert to remaining districts of telangana, Yellow alert to Hyderabad

According to the Telangana State Development Planning Society (TSDPS), the average rainfall recorded in the State was 80.1 cm against the normal rainfall of 43 cm between July 1 and August 1. Out of the 33 districts, as many as 30 have recorded large excess and remaining witnessed excess rainfall. Among all districts, Nirmal has received the highest rainfall during this period at 130 cm, followed by Mulugu (129 cm) and Jagtial (122 cm).

రాష్ట్రంలో ఈ నెల 13 వరకు తేలికపాటి వర్షాలు: వాతావరణ శాఖ

Posted: 08/10/2022 11:56 AM IST
Telangana state to receive light to moderate rainfall till 13 august

వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు ఈ నెల 13 వరకు మాత్రం ఊరట కల్పించాడు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు ఈ వార్తను తెలిపింది. రాష్ట్రా‌నికి పొంచివున్న వాయు‌గుండంతో తెలంగాణ జిల్లాల్లోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఇవాళ ఊరటనిచ్చే కబురును పంచుకుంది.

తెలంగాణకు వాయుగుండం ముప్పు తప్పిందని చెప్పిన భారత వాతావరణ శాఖ... ఈ కారణంగా వర్షాల తీవ్రత కూడా తగ్గిందని తెలిపింది. దీంతో రాష్ట్రప్రజలు కాసింత ఊరట పోందారు. జూలై మాసంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం కన్నా అదే మొత్తంలో వర్షపాత అధికంగా నమోదైంది. జులై 1 నుంచి ఆగస్టు 1 వరకు సగటున నమోదుకావాల్సిన 43 సెంటీమీటర్ల వర్షపాతం ఏకంగా 81 సెంటీమీటర్లుగా నమోదైంది. దీంతో ఏకంగా నూరుశాతం మేర వర్షపాతం అధికంగా నమోదైనట్లు తేలింది. కాగా, ఈ నెల 13 వరకు పలు‌చోట్ల తేలి‌క‌పాటి వర్షాలు మాత్రమే కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

ఒడిశా తీరప్రాంతంలో భువ‌నే‌శ్వర్‌కు ఉత్తర ఆగ్నేయ దిశలో 70 కిలో‌మీ‌టర్ల దూరంలో ఏర్పడిన వాయు‌గుండం బుధ‌వారం బల‌హీ‌న‌పడి అల్పపీ‌డ‌నంగా మారి ఛత్తీ‌స్‌‌గఢ్‌ పరి‌సర ప్రాంతాల్లో కేంద్రీ‌కృ‌త‌మయ్యే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొ‌న్నది. రుతు‌ప‌వ‌నాల ద్రోణి నలియా, అహ్మదా‌బాద్‌, ఇండోర్‌, రాయ‌గఢ్‌ మీదుగా కోస్తా ఒడిశా వద్ద ఉన్న వాయు‌గుండం వరకు వ్యాపించి ఉన్నదని వెల్లడించింది. ఈ వాయు‌గుండం ప్రభావం మరా‌ఠ్వాడ, విదర్భ, ఒడిశా, ఛత్తీ‌స్‌‌గ‌ఢ్‌పై ఉన్నదని, తెలం‌గా‌ణపై నామ‌మా‌త్రం‌గానే ఉన్నదని ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలి‌పారు. వాయు‌గుండం ప్రభా‌వంతో ఉత్తర తెలం‌గాణ జిల్లాల్లో బుధ‌వారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles