ED raids head office of National Herald newspaper నేష‌న‌ల్ హెరాల్డ్ ఆఫీసుల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

National herald offices raided by enforcement directorate rahul gandhi says we won t get afraid

money laundering, Enforcement Directorate (ED), National Herald, Indian National Congress, Sonia Gandhi, Rahul Gandhi, Karti Chidambaram, Bahadur Shah Zafar Marg, ITO in central Delhi, Associated Journals Ltd, Prevention of Money Laundering Act, Subramanian Swamy, National Politics

The Enforcement Directorate raided the head office of the Congress-owned National Herald newspaper in Delhi and 11 other locations in connection with a money-laundering probe, prompting the party to allege “vendetta politics” by the Narendra Modi government to “silence” the principal Opposition. The raids came against the backdrop of the agency questioning Congress president Sonia Gandhi and Rahul Gandhi over days in connection with the case.

గాంధీల విచారణ తరువాత.. నేష‌న‌ల్ హెరాల్డ్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

Posted: 08/02/2022 04:50 PM IST
National herald offices raided by enforcement directorate rahul gandhi says we won t get afraid

దేశవ్యాప్తంగా నేష‌న‌ల్ హెరాల్డ్ ఆఫీసుల్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఇటీవ‌ల మ‌నీల్యాండ‌రింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను ఈడీ విచారించిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఆ ప‌త్రిక‌కు సంబంధించిన 12 ప్ర‌దేశాల్లో ఈడీ ఆఫీస‌ర్లు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. మ‌నీల్యాండ‌రింగ్ కేసుతో నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల్ని అటాచ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఇటీవ‌ల సోనియా గాంధీని ఈడీ సుమారు వంద ప్ర‌శ్న‌లు వేసిన విష‌యం తెలిసిందే. హెరాల్డ్ హౌజ్‌లో నాలుగ‌వ అంత‌స్తులో ఈడీ సోదాలు చేస్తోంది. ఆ ఫ్లోర్‌లోనే నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌బ్లికేష‌న్ ఆఫీసు ఉంది. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు ఈడీ అధికారులు ఆఫీసుకు వెళ్లారు. ప్ర‌స్తుతం ఇంకా సోదాలు కొన‌సాగుతున్నాయి.

నేష‌న‌ల్ హెరాల్డ్ కార్యాల‌యాల‌పై ఈడీ దాడుల నేప‌ధ్యంలో కేంద్రంలోని కాషాయ స‌ర్కార్ ల‌క్ష్యంగా కాంగ్రెస్ నేత కార్తీ చిదంబ‌రం విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ దాడుల‌ను బూట‌కంగా కొట్టిపారేసిన కార్తీ చిదంబరం కేంద్రం చేతిలో ఈడీ విధ్వంస ఆయుధంగా మారింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ద‌ర్యాప్తు ఏజెన్సీ బ‌లోపేతానికి ఊత‌మిస్తూ సుప్రీంకోర్టు తీర్పు అనంత‌రం ఈడీ మ‌రింత ప‌దునుతేలింద‌ని, కేంద్రం చేతిలో విధ్వంస ఆయుధంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. నిబంధ‌న‌ల‌ను తోసిరాజేస్తూ దాడులు, స‌మ‌న్లు, అరెస్టుల‌తో చెల‌రేగుతున్నార‌ని అన్నారు. ఖాతా పుస్త‌కాల్లో అన్ని వివ‌రాలు ల‌భించే ప‌బ్లికేష‌న్స్ కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డం మూర్ఖ‌త్వ‌మ‌ని మండిప‌డ్డారు.

పాల‌కుల‌ను మెప్పించేందుకు నేష‌న‌ల్ హెరాల్డ్ కార్యాల‌యాల‌పై దాడులు చేప‌ట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ ప్ర‌భుత్వ జేబు సంస్ధ‌గా ఈడీ మారింద‌ని ఆరోపించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ ఉద్యోగులు, సంస్ధ సిబ్బందికి అసౌక‌ర్యం క‌లిగించేందుకే దాడులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. విప‌క్షాల గొంతు నొక్కే కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌లోనే భాగంగా ఈ దాడులకు తెగ‌బ‌డ్డార‌ని అన్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రూ 34,615 కోట్లు న‌ష్ట‌పోయింద‌ని, మెహుల్ చోక్సీ నుంచి నీర‌వ్ మోదీ వ‌ర‌కూ వేలాది కోట్లు దిగ‌మింగార‌ని వీటి గురించి ప్ర‌భుత్వం ఏమైనా క‌ల‌త చెందుతోందా అస‌లు వారిని తిరిగి దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా అని మోదీ స‌ర్కార్‌ను నిల‌దీశారు.

ధరాఘతం, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ధర్నా నిర్వహిస్తున్నారు. అక్కడే నిద్రహారాలు తీసుకుంటు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయబడిన 24 మంది విపక్ష ఎంపీలు కూడా ఉన్నారు. దీంతో పెరుగుతున్న ధరల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై తీవ్రంగానే పడుతుందని, దీనికి తోడు పెరుగుతున్న జీఎస్టీ స్లాబ్ లు కూడా సామాస్యులకు శరాఘాతంగా పరిణమించాయని వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఏకంగా కొన్న కోట్ల మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర సరుకుల ధరల ప్రభావం, జీఎస్టీ ప్రభావం చూపుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు పేదలుగా మారుతున్నారని వారు అక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి కాసింత బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలకు కూడా బలం పెరగనుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన అధికార రాజకీయ శక్తి బలం పెరిగినా.. తమ చక్కుచేతల్లోనే పార్టీ ఉండేలా చర్యలు తీసుకునేందుకు నేషనల్ హెరాల్డ్ అనే తేనెతుట్టను కదిపారని వార్తలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles