Banks to remain closed for up to 18 days ఆగ‌స్టులో బ్యాంకుల‌కు సెల‌వులే సెలువులు.. ఎన్ని రోజులంటే..!

Bank holidays in august lenders to remain shut for 18 days this month

bank holiday, bank holiday in august, is today a bank holiday, rakhi bank holiday, muharram bank holiday, is 15th august bank holiday, is 1st august bank holiday, Rakhi Poornima bank Holiday, Janmashtami bank Holiday, Ganesh Chaturthi bank Holiday, bank holidays in august 2022, this month bank holiday, axis bank holiday list 2022, August 2022, Independence day, muharram, Rakhi Poornima, Janmashtami, Ganesh Chaturthi, Bank holidays

Bank Holidays in August 2022: The new month of August has begun already, and from Monday, August 1, there will be a new set of bank holidays that will come into effect. There are 18 bank holidays in August, and August 1 is a bank holiday. However, it must be noted that many bank holidays are regional and may differ from state to state and bank to bank.

ఆగ‌స్టులో బ్యాంకుల‌కు సెల‌వులే సెలువులు.. ఎన్ని రోజులంటే..!

Posted: 08/01/2022 01:39 PM IST
Bank holidays in august lenders to remain shut for 18 days this month

దేశంలో బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇక మరీ ముఖ్యంగా చేతిలో రూ.2 లక్షలకు మించిన నగదు ఉండరాదని.. నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ తాజాగా అదేశాలు జారీ చేసిన నిబంధనతో చాలావరకు డిజిట‌ల్ చెల్లింపులు పెరిగాయి. అయినా.. బ్యాంకు ఖాతాదారులకు మాత్రం బ్యాంకులకు వెళ్లి త‌మ ఖాతాల లావాదేవీలు జరపడంలో ఉన్న సంతోషమే వేరు. అరచేతిలో బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నా.. ఇప్పటితరం యువత మినహాయిస్తే.. మిగిలిన కస్టమర్లు అందరూ బ్యాంకులకు వెళ్లేవాళ్లే. అదే వాళ్లకు సంతృప్తినిస్తుంది.

అయితే, మిగ‌తా వారి మాదిరిగానే బ్యాంకు ఉద్యోగుల‌కు సెల‌వులు ఉంటాయి. క‌నుక రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలు జ‌రిపేవారికైతే.. సెల‌వులు ఎప్పుడు ఉన్నాయో తెలుస్తుంది. అలా కాకుండా అప్పుడ‌ప్పుడు బ్యాంకు శాఖ‌ల‌కు వెళ్లే వారికి పూర్తి వివ‌రాలు తెలియ‌వు. క‌నుక ఏయే రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయో తెలుసుకుంటే లావాదేవీలు జ‌రుప‌డం తేలిక‌వుతుంది. కాగా ప్రతీ నెల రెండు, నాలుగు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలు బ్యాంకులు పనిచేయవన్న విషయం తెలిసిందే. ఇక వీటికి తోడు వచ్చే పండుగలు, ఇతర సెలవుల వివరాలు ఆగస్టు నెలలో ఇలా ఉన్నాయి.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇచ్చే సెలవులన్నింటినీ కలుపుకుంటే.. ఆగస్టు నెలలో మొత్తం 18 రోజులు బ్యాంకులు ప‌ని చేయ‌వు. ఆగ‌స్ట్ 11న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా బ్యాంకులు సెల‌వు. నాలుగు ఆదివారాలు, రెండు శ‌నివారాలు బ్యాంకులు ప‌ని చేయ‌వు. ఆగ‌స్టు 13 నుంచి 15 వ‌ర‌కు వ‌రుస‌గా మూడు రోజులు బ్యాంకింగ్ లావాదేవీలు ఉండ‌వు. 13న రెండో శ‌నివారం, 14న ఆదివారం, 15న దేశ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా వ‌రుస‌గా మూడు రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. క‌నుక బ్యాంకుల‌కు వెళ్లే వారు వ‌చ్చే నెల‌లో ఏయే రోజుల్లో సెల‌వులు ఉన్నాయో తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఆగ‌స్ట్‌లో బ్యాంకులకు సెల‌వులు ఇలా..

తేదీ -- సెల‌వు కార‌ణం -- ఏయే ప్రాంతాల్లో సెల‌వు
1 -- దృప‌క షీ-జీ పండుగ  -- సిక్కిం
7 -- ఆదివారం  
8 -- మొహ‌రం  -- జ‌మ్ముక‌శ్మీర్‌
9 -- మొహ‌రం  -- ప‌లు ప్ర‌దేశాల్లో సెల‌వు
11 -- ర‌క్షాబంధ‌న్  -- అహ్మ‌దాబాద్‌, భోపాల్‌, జైపూర్‌, సిమ్లా
12 -- ర‌క్షాబంధ‌న్  -- కాన్ఫూర్‌, ల‌క్నో
13 -- రెండో శ‌నివారం
14 -- ఆదివారం
15 -- స్వాతంత్య్ర దినోత్స‌వం
16 -- పార్శీ నూత‌న సంవ‌త్స‌రాది  -- నాగ్‌పూర్‌, ముంబై
18 -- జ‌న్మాష్ట‌మి  -- భువ‌నేశ్వ‌ర్‌, చెన్నై, కాన్పూర్‌, ల‌క్నో
19 -- జ‌న్మాష్ట‌మి  -- అహ్మ‌దాబాద్, భోపాల్, చండీగ‌ఢ్‌, చెన్నై, గ్యాంగ్‌ట‌క్‌, జైపూర్‌, జ‌మ్ము, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లా, శ్రీ‌న‌గ‌ర్‌
20 -- శ్రీ‌కృష్ణాష్ట‌మి --  హైద‌రాబాద్‌
21 -- ఆదివారం
27 -- 4వ శ‌నివారం  
28 -- ఆదివారం  
29 -- శ్రీ‌మంత్ శంక‌ర్‌దేవ్ జ‌యంతి  -- గువ‌హాటి
31 -- గ‌ణేష్ చ‌తుర్థి  -- అహ్మ‌దాబాద్, బేలాపూర్‌, బెంగ‌ళూరు, భువ‌నేశ్వ‌ర్‌, చెన్నై, హైద‌రాబాద్‌, ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles