'Don't talk to me': Sonia Gandhi lashes out at Smriti Irani ‘రాష్ట్ర‌ప‌త్ని’ వ్యాఖ్య‌ల ర‌గ‌డ: స్మృతి ఇరానీపై సోనియా గాంధీ ఫైర్

You don t talk to me sonia vs smriti in lok sabha over adhir s rashtrapatni remark

Parliament mansoon sessions, Rashtrapatni, Adhir Ranjan Chowdhury, Congress, BJP, President of India, Draupadi Murmu, Smriti Irani, Sonia Gandhi, Nirmala Sitharaman, Inflation, GST, Rupee value, Lok Sabha, Rajya Sabha, National Politics

In a dramatic confrontation in parliament over "Rashtrapatni" remarks, Congress president Sonia Gandhi reportedly rebuffed Union Minister Smriti Irani after walking across the house to speak to a BJP MP. When Smriti Irani reportedly cut in, Sonia Gandhi said "Don't talk to me", according to sources. The Congress and other opposition parties accused Smriti Irani and other BJP MPs of heckling Sonia Gandhi.

‘రాష్ట్ర‌ప‌త్ని’ వ్యాఖ్య‌ల ర‌గ‌డ: స్మృతి ఇరానీపై సోనియా గాంధీ ఫైర్

Posted: 07/28/2022 06:51 PM IST
You don t talk to me sonia vs smriti in lok sabha over adhir s rashtrapatni remark

భారత రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధీర్ రంజ‌న్ చౌధ‌రి చేసిన వ్యాఖ్య‌ల‌పై పార్ల‌మెంట్‌ ఉభయసభల్లో ప్ర‌కంప‌న‌లు రేగాయి. ‘రాష్ట్ర‌ప‌త్ని’ అంటూ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై తక్షణం క్షమాపణ చెప్పాలని బీజేపీ స‌హా ఎన్‌డీఏ ఫక్ష పార్టీలు ప‌ట్టుబ‌ట్టాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యుడిని కాదని.. ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అధీర్ వ్యాఖ్య‌ల‌పై సోనియా గాంధీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరో అడుగు ముందుకేసీ.. బీజేపి పార్టీ ఓ గిరిజన మహిళను దేశ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఇష్టంలేని కాంగ్రెస్ పార్టీ.. కావాలని అమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని అరోపించారు. ఈ వ్యాఖ్యలను సోనియాగాంధీ అమోదించారని, ఒక గిరిజన మహిళపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని సోనియా గాంధీ అమోదించారని అరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసి విరోధి, మ‌హిళా విరోధి, ద‌ళిత విరోధి, గిరిజన విరోధి అంటూ అవేశపూరితంగా మాట్లాడుతూ సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపి సభ్యుల తివ్ర నిరసనలతో సభ వాయిదా పడింది.

అయితే ఆ సమయంలో సోనియాగాంధీ బీజేపి సీనియర్ పార్లమెంటు సభ్యురాలు రమాదేవి వద్దకు వెళ్లి.. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యల వ్య‌వ‌హారంపై త‌మ ఎంపీ ఇప్ప‌టికే క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ విషయంలోకి తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని అమె రమాదేవితో అన్నారు. ఈ క్రమంలో సభలో మీ పేరును ప్రస్తావించింది నేను..? ఈ విషయంలో నేను మీకైమైనా సాయం చేయగలనా అంటూ స్మృతి ఇరానీ.. సోనియాగాంధీ, రమాధేవీల మధ్యలో జోక్యం చేసుకున్నారు. దీంతో సోనియా గాంధీ.. స్మృతి ఇరానీ వైపు చూస్తూ.. త‌న‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని మండిప‌డ్డారు.

ఆ వెంటనే స్మృతి ఇరానీ నేను నీ పేరును సభలో తీసింది.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండీ అంటూ అమె తీవ్ర స్వరంతో గట్టిగా అరిచింది. అంతేకాదు సోనియా వైపు వేలు చూయించి మాట్లాడుతూ.. ఇది మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు.. అని అన్నారు. దీంతో సోనియా గాంధీ.. నేను మీతో మాట్లాడటం లేదని చెప్పినా.. వెంటనే బీజేపి ఎంపీలు సోనియాను చుట్టుముట్టారు. ఆ పక్కనే ఉన్న తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, అపురూప పోడ్డార్, ఎన్సీపీ సుప్రియా సూలేలు సోనియా గాంధీని బీజేపి ఎంపీల మధ్య నుంచి పక్కకు తీసుకువచ్చారు. ఆ తరువాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకుని బీజేపి ఎంపీలను సద్దుమణిేటా చేశారు.

అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఈ గొడవ కావాలనే పథకరచన చేశారని తృణముల్ ఎంపీ మహువా మొయిత్ర అన్నారు. 75 ఏళ్ల సీనియర్ ఎంపీ, పార్టీ అధినేత్రిని చుట్టుముట్టి ఇలా వ్యవహరించడం సముచితం కాదని, ఇదంతా అమె అధికార మహిళా ప్యానెల్ చైర్ పర్సెన్ తో మాట్లాడేందుకని వెళ్లండతోనే జరిగిందని, కానీ మీడియాలో మాత్రం మరో విధంగా బీజేపి అబద్దాలు, తప్పుడు కథనాలను చూస్తే భాదేస్తుందని అమె ట్వీట్ చేశారు. తమ పార్టీ అధినేత్రితో కేంద్రమంత్రి స్మృతి ఇరాని అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మండిపడ్డారు. ఈ ఘటనపై స్పీకర్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలన్నారు. రూల్స్ అన్ని విపక్షాలకేనా.. అన్నది కూడా తేలిపోతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles