Heavy Rain Hits Hyderabad, Several Areas Waterlogged నగరంపై వరుణుడి ప్రతాపం: జలదిగ్భంధంలో భాగ్యనగరం..!

Normal life thrown out of gear due to heavy rain in hyderabad parts of telangana

heavy rain in hyderabad, hyderabad rains news, hyderabad rains today, hyderabad rains latest news, Hyderabad rains, telangana rains, Telangana

Heavy rains lashed Hyderabad and other parts of Telangana leading to waterlogging at several places in the city and elsewhere in the state. According to the meteorological office here, Khammam received 80 mm of rainfall, while Nalgonda got 25 mm till evening.In Hyderabad, the Urban Health Centre at Hafeezpet received 103.3 mm of rain, followed by Jeedimetla (102.5 mm), the Telangana State Development Planning Society said

ITEMVIDEOS: హైదరాబాద్ నగరంపై వరుణుడి ప్రతాపం: జలదిగ్భంధంలో భాగ్యనగరం..!

Posted: 07/22/2022 07:09 PM IST
Normal life thrown out of gear due to heavy rain in hyderabad parts of telangana

హైదరాబాద్ నగరవాసులపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపుతున్నాడు. గత మూడు, నాలుగు రోజులుగా తెరిపినిచ్చిన వాన.. ఇవాళ ఉదయం నుంచి మళ్లీ కుండపోత వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్లు నీట మునిగాయి. నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం ఏకంగా బీభత్సాన్ని తలపించింది. నగరవ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షం.. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులుగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లక్డీకపూల్, నారాయణగూడ, హిమాయత్​నగర్​ ప్రాంతాలలో ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి వరద నీరు రహదారులపైకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో అనేకప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కోఠిలో దుకాణాలలోకి నీరు చేరి.. వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, నాంపల్లి, అంబర్‌పేట్‌, ఎస్సార్​నగర్​, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

ఉదయం నుంచి కురిసిన వర్షానికి రాజ్‌భవన్‌రోడ్‌లో రహదారులు జలమయం అయ్యాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌ కాలనీలను వరద ముంచెత్తింది. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి తలెత్తింది. అమీర్‌పేట్‌లో రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. నిజాంపేట్‌లోని పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కుత్బుల్లాపూర్ లోనూ వివిధ బస్తీలను సైతం వరద ముంచెత్తింది. శేరిలింగంపల్లిలోని రైల్వే బ్రడ్జి అండర్ పాస్ రోడ్డు కూడా పూర్తి జలదిగ్భంధంలో చిక్కుకుంది. కూకట్ పల్లిలోనూ జోరు వర్షంతో కాలనీల్లోని రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది.

అపురూపకాలనీ ఇళ్లు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. సామగ్రి పూర్తిగా తడిచిపోయింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌బృందాలు....సహాయక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, చిలకలగూడ, బొల్లారం, జవహర్‌నగర్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్‌, మారేడుపల్లి, మెట్టుగూడ, రాణిగంజ్, రెజిమెంటల్‌ బజార్‌లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, పాటిగడ్డ, బ్రాహ్మణవాడి బస్తీల్లో కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం పడింది. దాంతో కొన్ని ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని ప్రసూన నగర్, మల్లికార్జున నగర్, వాని నగర్, ఇంద్ర సింగ్ నగర్, శ్రీనివాస్ నగర్​ను వరద ముంచెత్తింది. నాలాల్లోని వరద కాలనీల్లోకి రావడంతో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సురారం ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ రాంనగర్, వెంకటేశ్వర కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. జీడిమెట్ల డిపో వద్ద వరద నీరు రోడ్డుపై నిలిచింది.

భారీ వర్షం నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు నగరవాసులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్లపైకి రాకుండా గంట తర్వాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశముంటుందని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles