Delhi HC stays CCPA's service charge norms సర్వీసు టాక్స్ పై ట్విస్టు.. స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

Delhi high court stays ban on levy of service charge by restaurants on food bills

Central Consumer Protection Authority, Delhi High Court, Justice Yashwant Varma, Service charge, Hotels, Restaurants, Food Bills, CCPA' guidelines, Ministry of Consumer Affairs, single-judge bench, service charge, customers

The Delhi High Court has stayed the Ministry of Consumer Affairs guidelines which prohibit hotels and restaurants from levying service charge automatically on bills. Petitions were made by the National Restaurant Association of India (NRAI) and Federation of Hotels and Restaurant Associations of India challenging the Central Consumer Protection Authority (CCPA)' guidelines.

సర్వీసు టాక్స్ పై ట్విస్టు.. సీసీపీఏ అదేశాలపై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

Posted: 07/20/2022 06:00 PM IST
Delhi high court stays ban on levy of service charge by restaurants on food bills

హోటళ్లు, రెస్టారెంట్లలో జారీ చేసే బిల్లులలో తప్పనిసరిగా సర్వీసు ఛార్జ్ వేయకూడదన్న నిబంధనలపై ట్విస్టు ఏర్పడింది. సర్విసు చార్జీలు కస్టమర్ల ఇష్టాఇష్టాలపై అధారపడిన అంశమే కానీ.. డానిని తప్పనిసరి చేస్తూ రెస్టారెంట్లు, హోటల్ యాజమాన్యాలు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. గతంలో ఇచ్చిన అదేశాలను జారీ చేసింది. దీంతో తప్పనిసరి సర్వీసు చార్జీలను వసూలు చేయడాన్ని నిషేధిస్తూ.. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) ఇటీవల నూతన అదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా సీసీపీఏ జారీ చేసిన నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. జాతీయ రెస్టారెంట్ల సంఘం, జాతీయ హోటళ్ల సంఘం ఈ నిబంధనలపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్​ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నవంబర్​ 25 వరకు సీసీపీఏ తెచ్చిన నిబంధనలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల విధింపు విషయాన్ని మెనూలో, బహిరంగంగా ప్రదర్శించాలని.. టేక్​అవేపై ఎలాంటి ఛార్జీలు విధించరాదని సూచించింది. వినియోగదారుడు ఛార్జీలు కట్టడానికి ఇష్టపడకపోతే.. రెస్టారెంట్​కు రావద్దని, అది అతడి ఎంపిక అని తెలిపింది.

అంతకుముందు జులై 4న హోటల్స్, రెస్టారెంట్స్​లో సర్వీస్ ఛార్జ్ బాదుడు నుంచి ఉపశమనం కలిగించేలా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక ఆదేశాలు వెలువరించింది. బిల్​లో ఆటోమెటిక్​గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్​ అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు బిల్స్ వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles