CPI Narayana withdraws his comments against Chiranjeevi చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా: సీపిఐ నారాయణ

Cpi narayana regrets for his comments against megastar chiranjeevi

CPI Narayana withdraw his comments on Chiranjeevi, CPI Narayana withdraw his comments on Megastar, CPI Narayana apology to chiranjeevi, CPI Narayana apology to megastar, CPI Narayana, Nagababu, mega fans, Janasena activists, Alluri Sitaramaraju statue, PM Narendra Modi, Bhimavaram, YS Jagan, YSRCP, BJP, Andhra Pradesh, Politics

CPI national secretary K Narayana expressed regrets over his remarks against Tollywood Megastar Chiranjeevi. Speaking to the media, Narayana said that he is feeling sorry for the comments made against Chiranjeevi during a press meet held in Tirupati. He further added that he is withdrawing the comments made against Chiranjeevi.

చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా: సీపిఐ నారాయణ

Posted: 07/20/2022 02:45 PM IST
Cpi narayana regrets for his comments against megastar chiranjeevi

ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవిపై.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తిరుపతిలో ఆయన మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏ హోదాలో చిరంజీవి హాజరు అయ్యారని ప్రశ్నించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు నారాయణ. అంతేకాదు పనిలోపని అన్నట్లుగా అటు జనసేన పార్టీపై, ఆ పార్టీఅధినేత పవన్ కల్యాణ్ పై కూడా ఆయన విమర్శలు చేశారు.

వామపక్షాలతో గత అసెంబ్లీ ఎన్నికలలో పొత్తుపెట్టుకుని.. ఆ తరువాత బీఎస్సీతో కలసి పోటీకి దిగిన జనసేన.. తాజాగా బీజేపితో మైత్రిని కోనసాగిస్తుండటంతో ఆయన సునిషిత విమర్శలు చేశారు. దీంతో నారాయణ వ్యాఖ్యల పట్ల చిరంజీవి అభిమానులు, జనసైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ అంశంపై తాజాగా నారాయణ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాప పడుతున్నట్లు విజయవాడలో చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై భీమవరంలో నిర్వహించిన అల్లూరి విగ్రహావిష్కరణ సభకు సినీనటుడు చిరంజీవిని ఏ హోదాలో ఆహ్వానించారని ప్రశ్నించిన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమానికి సూపర్‌ స్టార్‌ కృష్ణను ఆహ్వానిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా చేసిన చిరంజీవిని ప్రధాని మోడీ పాల్గోన్న సభా వేదికపైకి తీసుకురావడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ల్యాండ్‌మైన్‌ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని నారాయణ ఎద్దేవా చేశారు.

నారాయణ వ్యాఖ్యలపై చిరంజీవి, పవన్ అభిమానులు.. జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నారాయణను ట్రోల్ చేస్తున్నారు. నారాయణ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘నారాయణ  అనే వ్యక్తి చాలాకాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నారు. కాబట్టి మన మెగా అభిమానులంతా అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి’ అని కామెంట్ చేశారు. అయితే, నారాయణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో ఈ గొడవకు పుల్ స్టాప్ పడినట్టు అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles