Model, Friend Held With Drugs Worth Rs 1 Crore డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన మోడల్.. సినీపక్కీలో పోలీసుల చేజింగ్..

Delhi model girlfriend who used to supply drugs in delhi university arrested

Drugs, contraband, Malana, Himachal pradesh, Delhi University, Delhi Crime branch Police, Old Gupta Colony, 25-year-old model, Shubham Malhotra, Sunny, girlfriend, Kirti, drug peddling, Delhi, Crime

The Delhi Police Crime branch seized 1.010 kg of drugs worth more than Rs one crore from a 25-year-old model and his girlfriend in North Delhi. The accused have been identified as Shubham Malhotra alias Sunny and Kirti (27). Both used to supply drugs around the Delhi University campus.

డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన మోడల్.. సినీపక్కీలో పోలీసుల చేజింగ్..

Posted: 07/19/2022 04:11 PM IST
Delhi model girlfriend who used to supply drugs in delhi university arrested

దేశరాజధాని ఢిల్లీలో సినీపక్కీలో ఛేజింగ్ చేసుకుంటూ పోలీసులు ఓ డగ్ర్స్ రవాణా చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోటి రూపాయలకు పైగా విలువైన 1.010 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న 25 ఏళ్ల మోడల్‌ను, అతడి గాళ్ ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ అతడి స్నేహితురాలు కీర్తి(27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్‌లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో రెండుమూడు రోజులు గడిపిన సన్నీ సింగు సరిహద్దు మీదుగా తన కారులో ఉదయం ఆరేడు గంటల సమయంలో ఢిల్లీ వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సింగు సరిహద్దు వద్ద కాపు కాసిన పోలీసులు అతడి కారును ఆపాలని ప్రయత్నించినా భారీవర్షానికి తోడు అతడు అత్యంత వేగంగా దూసుకెళ్తుండడంతో పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే పోలీసులు మాత్రం తమ టార్గెట్ ను మిస్ చేసుకోదలచుకోలేదు.

దీంతో ఓ బృందం అతడి కారును అనుసరించగా, మరో బృందం అతడు నివసించే ఓల్డ్ గుప్తా కాలనీకి వెళ్లింది. 45 నిమిషాల ఛేజింగ్ తర్వాత ఓల్డ్ గుప్తా కాలనీలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 2016లోనే తనకు ధూమపానం, డ్రగ్స్ అలవాటయ్యాయని, ఖర్చుల కోసం స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం ప్రారంభించానని పోలీసుల విచారణలో సన్నీ పేర్కొన్నాడు. ఇందులో పెద్ద ఎత్తున లాభాలు వస్తుండడంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్, మలానా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు చెప్పాడు. తనకు సాయంగా ఉండేందుకు స్నేహితురాలైన కీర్తిని కూడా ఇందులోకి దింపినట్టు చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drugs  Malana  Himachal pradesh  Delhi University  Delhi Police  Shubham Malhotra  Sunny  Kirti  drug peddling  Delhi  Crime  

Other Articles