Airport Staff Foil Basil Rajapaksa’s Bid To Flee Sri Lanka లంక విడిచి వెళ్లేందుకు మాజీమంత్రి యత్నం.. చెక్ పెట్టిన అధికారులు

Passengers airport staff foil basil rajapaksa s bid to flee sri lanka

Sri Lanka, Basil Rajapksa, Gotabaya Rajapaksa, Mahinda Rajapaksa, basil rajapaksa fleeing, basil rajapaksa airport, passengers, Washington, Colombo International Airport, boarding flight, Sri Lanka Econimic Crisis

Sri Lanka’s former finance minister Basil Rajapaksa was apprehended by passengers as he was trying to flee the nation for Washington. Passengers and the airport staff at the Colombo International Airport caught him fleeing and the airport staff as well other authorities also barred him from boarding the flight.

శ్రీలంక విడిచి వెళ్లేందుకు మాజీమంత్రి యత్నం.. చెక్ పెట్టిన ఇమ్మగ్రేషన్ అధికారులు

Posted: 07/12/2022 09:16 PM IST
Passengers airport staff foil basil rajapaksa s bid to flee sri lanka

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స నివాసాలను ఇటీవల ముట్టడించి ఆక్రమించుకున్న ఆందోళనకారులు ఇంకా అక్కడే తిష్ఠవేశారు. తిరుగుబాటుదారులను ఎలా అడ్డుకోవాలో కూడా తెలియని పోలీసులు కూడా జోక్యం చేసుకోకపోవడంతో అధ్యక్ష, ప్రధాని నివాస భవనాల వద్ద వాతావరణం ప్రశాంతంగానే ఉంది. దీంతో అధ్యక్ష నివాసంలో తిరుగుబాటుదారులు తిష్టవేశారు. గత రెండు రోజులుగా వారు అక్కడే ఉంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడే నిద్రాహారాలను కానిచ్చేస్తున్నారు.

మరోవైపు, అధ్యక్షుడు వైదొలగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని నిరసనకారులు చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడిని ఈ నెల 20న ఎన్నుకుంటామని స్పీకర్ మహింద యాపా అబేవర్ధన తెలిపారు. పార్లమెంటు తెరుచుకునేందుకు ఈ శుక్రవారం ముహూర్తంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఐదు రోజుల తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రితోపాటు ఆయన కేబినెట్ రాజీనామాకు సిద్ధంగా ఉందని అధికార పార్టీ పేర్కొంది.

ఇంకోవైపు, తాత్కాలిక అధ్యక్ష పదవికి సజిత్ ప్రేమదాసను నామినేట్ చేయాలని శ్రీలంక ప్రధాన ప్రతిపక్షమైన సమగి జన బలవేగయ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ పార్టీకి పార్లమెంటులో దాదాపు 50 మంది ఎంపీలు ఉన్నారు. కాగా, మాజీ మంత్రి బాసిల్ రాజపక్సే గత రాత్రి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కటునాయకే ఎయిర్ పోర్టులోని సిల్క్ రూట్ డిపార్చర్ టెర్మినల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో దేశం విడిచి పారిపోవాలన్న ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles