AIADMK Tussle: EPS Is New Boss అన్నాడీఎంకే కొత్త బాస్ గా ఈపీఎస్.. ఓపీఎస్ బహిష్కరణ

Aiadmk tussle eps is new boss rival ops expelled

AIADMK General Council, Madras High Court, EPS, OPS, ADMK, AIADMK, Edappadi K Palaniswami, O Panneerselvam, OPS expelled, EPS interim general secretary, AIADMK interim general secretary, Natham Viswanathan, D Jayakumar, AIADMK headquarters sealed, OPS dharna, Tamil Nadu Politics

Putting an end to the dual-leadership model in the AIADMK, Edappadi K Palaniswami, also known as EPS, was today elevated as the interim general secretary of the party. Rival leader O Panneerselvam or OPS has been expelled for "anti-party" activities.

అన్నాడీఎంకే కొత్త బాస్ గా ఈపీఎస్.. ఓపీఎస్ సహా మద్దతుదారుల బహిష్కరణ

Posted: 07/11/2022 06:33 PM IST
Aiadmk tussle eps is new boss rival ops expelled

తమిళనాడులోని విపక్ష అన్నాడీఎంకే పార్టీలో ఏకనాయకత్వ వ్యవహారంపై ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న అంశానికి తెరపడింది. మాజీ ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని ఆ పార్టీ అగ్రనేత పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఈపీఎస్‌ వర్గం నేత్వత్వంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతులిచ్చింది. దీంతో మాజీ సీఎం పళనిస్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించాక పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. నాటి నుంచి పన్నీర్‌సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి సంయుక్త సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. అయితే, ద్వంద్వ నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారిందని.. పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించి చర్చిచారు.  దానిలో పళనిస్వామి మద్దతుదారులు ఏక నాయకత్వ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. దీనికి పన్నీర్‌సెల్వం వర్గీయులు ససేమిరా అన్నారు.

ఈ క్రమంలోనే కోర్టు కేసులు తదితర నాటకీయ పరిణామాల అనంతరం గత నెల 23న సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. ఏక నాయకత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తదుపరి సమావేశాన్ని జులై 11వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ఈ సమావేశం జరగకుండా నిషేధించాలని పన్నీర్‌ సెల్వం వర్గం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నేడు ఓపీఎస్‌ వర్గం పిటిషన్‌ను తిరస్కరిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. పళని నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.

కోర్టు తీర్పు చెప్పిన కొద్దిసేపటికే ఈపీఎస్‌ నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కొత్తగా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పదవిని తీసుకొచ్చారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకునేందుకు చేసిన తీర్మానానికి కూడా ఆమోదముద్ర వేశారు. కో ఆర్డినేటర్‌, జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ పదవులను తొలగిస్తూ తీర్మారాన్ని ఆమోదించారు. పళని వర్గం తీసుకొచ్చిన మొత్తం 16 తీర్మానాలను ఆమోదించారు. త్వరలోనే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles