Sri Lanka prime minister's house set on fire శ్రీలంక అధ్యక్షుడు పరార్.. ప్రధాని పదవికి రణిల్‌ విక్రమసింఘే రాజీనామా

Protesters storm sri lanka president house set pm s residence on fire

sri lanka protests, sri lanka crisis, sri lanka crisis updates, sri lanka protests live updates, sri lanka news updates, sri lanka news, Sri Lankan President Gotabaya Rajapaksa, Gotabaya Rajapaksa, Rajapaksa ,Gotabaya, Sri Lankan President,Sri Lanka President, President of sri lanka, economic crisis or sri lanka, economic crisis, sri lanka economic crisis, lanka economic crisis, sri lankan economic crisis, Sri Lanka Prime Minister, Ranil Wickremesinghe, Wickremesinghe,International Monetary Fund, U.S. Ambassador to Sri Lanka

With protests against the Sri Lanka government intensifying over the country’s worst economic crisis, a number of demonstrators stormed the President’s official residence and his secretariat in commercial capital Colombo on Saturday.

శ్రీలంక అధ్యక్షుడు పరార్.. ప్రధాని పదవికి రణిల్‌ విక్రమసింఘే రాజీనామా

Posted: 07/09/2022 07:36 PM IST
Protesters storm sri lanka president house set pm s residence on fire

ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దీనికి తోడు రాజకీయ అస్థిరత కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. గొటబాయ నివాస ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారు. దానికి సంబంధించిన చిత్రాలు అక్కడ మీడియాలో ప్రసారం అయ్యాయి.  

అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ.. కొలంబో వీధుల్లో శనివారం నిరసనకారులు భారీ ర్యాలీకి దిగారు. పోలీసులు కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేసిన క్రమంలో ఆందోళన కారులు వీధుల్లోకివచ్చారు. వారంతా శ్రీలంక జెండాలు, హెల్మెట్లు ధరించి అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బారికేడ్లను తోసుకుంటూ గొటబాయ నివాసంలోకి దూసుకెళ్లారని మీడియా వర్గాలు వెల్లడించాయి. కొలంబోలో నిరసనలు ప్రారంభానికి  ముందే రాజపక్స అధ్యక్ష భవనాన్ని వీడినట్లు తెలుస్తోంది.

పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన్ను ఆర్మీ కేంద్రకార్యాలయానికి తరలించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ పరిస్థితు నేపథ్యంలో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నిరసనకారులు ఇంటిని చుట్టుముట్టడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పరారవగా.. ప్రధాని రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. స్పీకర్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం రణిల్ విక్రమసింఘే తన రాజీనామాను ప్రకటించారు.

అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమసింఘే, గొటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలోనే విక్రమసింఘే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామాను ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘దేశ ప్రజల భద్రత సహా ప్రభుత్వ కొనసాగింపు కోసం నేను ఈ రోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సును అంగీకరిస్తున్నా. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి పరారయ్యారు. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. గొటబాయ నివాస ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టి ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఆ భవనంలో స్విమ్మింగ్‌ పూల్‌లో నిరసనకారులు ఈత కొట్టడం, కిచెన్‌లో వంట చేసుకున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles