New Omicron Sub-variant BA.2.75 Sets Alarm Bells Ringing భారత్ లో ఒమిక్రాన్ కొత్త ఉపవేరియంట్.. బీఏ.2.75

Covid 19 new covid 19 omicron sub variant ba 2 75 detected in countries like india who

Covid-19 new variant, coronavirus new variant, covid19 new variant, covid19 Patna new variant, coronavirus Patna new variant, coronavirus Omicron variant, covid19 Omicron new variant, BA.2.75 variant, BA.2.75 covid19 variant, BA.2.75 coronavirus variant, BA.2.75 India, BA.2.75 Maharashtra, BA.2.75 Delhi, Haryana, Telangana, Madhya Pradesh, Karnataka, West Bengal, Uttar Pradesh, Japan, Germany, UK

World Health Organisation (WHO) confirmed that a new sub-lineage of COVID-19-causing coronavirus’ Omicron variant, widely referred to as BA.2.75, has been detected in India and at least ten other countries. This update arrived just days after an Israeli expert, Dr Shay Fleishon with the Central Virology Laboratory at Sheba Medical Center in Tel Hashomer, revealed that 85 sequences of this new sub-lineage had been uploaded from different countries

భారత్ లో ఒమిక్రాన్ కొత్త ఉపవేరియంట్.. బీఏ.2.75గా నామకరణం..

Posted: 07/08/2022 12:33 PM IST
Covid 19 new covid 19 omicron sub variant ba 2 75 detected in countries like india who

కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా కొత్త వేరియంట్లుగా పరివర్తన చెంది ప్రపంచదేశాలపై దాడి చేస్తూనే వుంది. యావత్ ప్రపంచ మానవాళిపై తీవ్రప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తాజాగా మరో ఉప వేరియంట్ విజృంభనతో అందోళన కలిగిస్తోంది. భారత్ సహా దాదాపుగా పది దేశాలలో నూతన ఉప వేరియంట్ కలకలం రేపుతున్నాయి. భారత్ లో తొలిసారిగా ఓమిక్రాన్‌ వైరస్‌ కొత్త ఉప–వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. దీనికి బీఏ.2.75 అని పేరు పెట్టారు. యూరప్‌–అమెరికాలో బీఏ.4 , బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ తెలిపారు.

భారత్‌ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్‌–వేరియంట్‌ ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ వేరియంట్‌ తొలిసారిగా భారత్‌లో కనిపించిందని, తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని ఆయన వెల్లడించారు. భారత్ దేశంలో ఈ నెల 3 నాటి గణంకాల ప్రకారం ఢిల్లీ (1), హర్యానా (6), హిమాచల్ ప్రదేశ్ (3), జమ్ము (1), కర్ణాటక (10), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర (27), తెలంగాణ (2), ఉత్తరప్రదేశ్ (1) మరియు పశ్చిమ బెంగాల్ (13) కేసులను గుర్తించామని, మొత్తంగా దేశంలో 69 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

కాగా డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఈ రకం కరోనా ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కేసులు పలు దేశాలలోనూ బయటపడ్డాయని తెలిపింది. వాటిలో జపాన్ (1), జర్మనీ (2), యుకె (6), కెనడా (2), యుఎస్ (2), ఆస్ట్రేలియా (1) న్యూజిలాండ్ (2) ఉన్నాయని పేర్కొంది. అయితే బీఏ.2.75 తదుపరి ఆధిపత్య వేరియంటేనా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని డాక్టర్ ఫ్లీషాన్ పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా, గత 24 గంటల్లో భారత్‌లో 18,930 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 1,17,893కు పెరిగాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles