Indian Coast Guard rescues 22 crew members from sinking ship విదేశీ నౌక సిబ్బందిని రక్షించిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌

Indian coast guard rescues 22 crew members of sinking ship near gujarat s porbandar coast

commissioned HAL Dhruv choppers, bitumen, Khor Fakkan in UAE to Karwar in India, Indian Coast Guard, Dwarka coast, 'Island Watch', Porbandar coast in Gujarat, sinking ship, indian coast guard, icg, Porbandar coast, sinking merchant ship, merchant ship, Arabian Sea, gujarat

Indian Coast Guard carried out Op 'Island Watch' along Dwarka coast, Gujarat where hovercrafts carried out search of uninhabited islands in vicinity. Coast Guard Hovercrafts can carry out amphibious ops and chase anti-national elements in marshy and high sea areas at high speeds.

ITEMVIDEOS: సముద్రంలో ప్రమాదం… 22 మంది విదేశీ నౌక సిబ్బందిని రక్షించిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌

Posted: 07/06/2022 08:54 PM IST
Indian coast guard rescues 22 crew members of sinking ship near gujarat s porbandar coast

విదేశీ రవాణా నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఆ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది. గుజరాత్‌ తీరంలోని అరేబియా సముద్రంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన ఎంటీ గ్లోబల్ కింగ్ I, యూఏఈలోని ఖోర్ ఫక్కన్ నుంచి కర్ణాటకలోని కార్వార్‌కు 6,000 టన్నుల బిటుమెన్‌ను రవాణా చేస్తున్నది. అయితే గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి 93 నాటికల్‌ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న ఈ రవాణా నౌక అనియంత్రిత వరదల కారణంగా ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ఎంటీ గ్లోబల్ కింగ్ నుంచి ప్రమాద హెచ్చరికను భారత్‌ కోస్ట్ గార్డ్‌ అందుకుంది.

కాగా, ప్రమాద హెచ్చరిక అందుకున్న కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. కోస్ట్‌ గార్డ్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన ద్రువ్‌ హెలీకాప్టర్‌ ద్వారా ఎంటీ గ్లోబల్‌ కింగ్‌ వద్దకు చేరుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఓడ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అందులో ఉన్న 22 మంది సిబ్బందిని రక్షించి హెలీకాప్టర్‌ ద్వారా పోర్‌బందర్‌కు చేర్చారు. కోస్ట్‌ గార్డ్‌ అధికారులు ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. రెస్క్యూకు సంబంధించిన ఒక వీడియోను కూడా ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles