Lalitpur in Nepal bans Pani Puri over Cholera spike పానీపూరీలో కలరా బ్యాక్టీరియా.. రాజధాని నగరంలో నిషేధం.!

Ban on the sale of pani puri in nepal s kathmandu valley

ban on sale of Pani puri, ban on consuming of panipuri, cholera bacteria present in panipuri, Health emergency in Lalitpur metropolitan city, Health, Cholera, Pani puri, Health emergency, Lalitpur Metropolitan City, cholera bacteria, Pani Puri Water, cholera spread, Kathmandu, Nepal

The sale of Pani Puri has been banned in Nepal's Kathmandu after a rising number cholera cases were reported in Lalitpur Metropolitan City (LMC). The authorities in LMC took the decision to stop the sale of Pani Puri, citing health reasons. While announcing the orders, the officials said that cholera bacteria had been found in the water used in Pani Puri. Officials further feared that there was an increased risk of cholera spreading in the Valley.

పానీపూరీలో కలరా బ్యాక్టీరియా.. రాజధాని నగరంలో నిషేధం.!

Posted: 06/28/2022 12:45 PM IST
Ban on the sale of pani puri in nepal s kathmandu valley

పానీ పూరి పేరు చెబితే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. గోళానికి ఓ వైపు విరగగొ్ట్టి.. అందులో వేడివేడి చాట్ వేసి.. దానిని చేదు మినహాయించి షడ్రుచుల కలిసిన నీటిని నింపి.. చకచకా అందిస్తుండే.. వాటిని అమాంతం నోటిలో పెట్టుకుని కేవలం దవడలను దగ్గరకు తీసుకురావడంత అది కాస్దా విరిగి అందులోని నీరు, చాట్ అంటా నోటి నిండుగ కాగా, నీటిని మింగేసి.. మిగతాదంగా నమిలేసి మళ్లీ మరో గోల్ గప్పా కోసం రెడీ అవుతాం. ఇక మరికోందరు వీటిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తింటారు. ఇక కాస్తా కాస్ట్లీ సెంటర్లలో వీటిలో పెరుగును, లేదా స్వీటును కూడా పూరించి ఇస్తారు.

ఇలా దీనిని ఎలా అరగిస్తారని చెబుతుంటేనే నోరూరుతుంది కదూ.. కానీ అలాంటి పానీ పూరిపై రాజధాని నగరంలో నిషేధం విధించారంటే నమ్మశక్యమేనా.? అన్న అనుమానాలు వస్తున్నాయానా.? పానీపూరి.. ఛాట్ పై అధారపడి కొన్ని వేల కుటుంబాటు జీవనం సాగిస్తున్నాయి. ఇక వీటిపై నిషేధం విధిస్తే మరి వారికి మరో జీవనాధారం చూపించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉంది. అయితే ఈ నిషేధం విధింపు మన హైదరాబాద్ నగరంలోనో.. లేక అమరావతి నగరంలోనో కాదు.. అసలు మన రాష్ట్రాలోనే కాదు, మన దేశమే కాదు.. మరెక్కడా అంటారా.. మన పోరుగు దేశంలో. అదేనండీ నెపాల్ లో. నేపాల్ లోని ఖాట్మండులో పానీ పూరిపై నిషేధం విధించారు.

అయితే అందుకు తగు కారణాలను అక్కడి అధికారులు పేర్కోన్నారు. కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయన్న కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండులో పానీ పూరీపై నిషేధం విధించారు. ఇక్కడి లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. దీంతో ఇక్కడ పానీపూరీ అమ్మకాలు నిషేధిస్తున్నట్లు లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ (ఎల్ఎంసీ) అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ప్రజలంతా డయేరియా, కలరా వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles