Sanjay Raut slams Narayan Rane for 'threatening' Sharad Pawar రెబెల్స్..శరద్ పవార్ ను బెదిరిస్తారా.? ఇక రణమే: శివసేన

Union minister narayan rane threatened sharad pawar says sanjay raut

sanjay raut, shiv sena, maharashtra, sharad pawar, bjp, union minister, narayan rane, threatening politics, sanjay raut news, sanjay raut twitter, shiv sena news, shiv sena latest news, maharashtra crisis, maharashtra crisis news, maharashtra government, maharashtra government new, maharashtra government news today, maharashtra government crisis, maharashtra government crisis news, mumbai, BJP, Maharashtra, Politics

Shiv Sena troubleshooter Sanjay Raut began Friday with a jab at the Bharatiya Janata Party - which he, and his allies in the Congress and Nationalist Congress Party, have accused of engineering Eknath Shinde's revolt. Raut claimed that a union minister had threatened NCP chief Sharad Pawar, saying 'if attempts are made to the Maha Vikas Aghadi then Pawar will not go home'.

రెబెల్స్..శరద్ పవార్ ను బెదిరిస్తారా.? ఇక రణమే: శివసేన

Posted: 06/24/2022 04:15 PM IST
Union minister narayan rane threatened sharad pawar says sanjay raut

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు రెబల్స్‌కు అల్టిమేటం జారీ చేశారాయన. మహా వికాస్ అఘాడి(కూటమి ప్రభుత్వం)ని కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తే.. ఇంటికి వెళ్లనివ్వబోమని, రోడ్డుపై అడ్డుకుంటామని ఓ కేంద్ర మంత్రి బెదిరించారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విధమైన వ్యాఖ్యలు నిజమే అయితే.. బయటకు చెప్పుకోవాలని అన్నారు.

ఇక మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఉండినా, ఊడినా.. శరద్‌పవార్‌ లాంటి నేత మీద ఇలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదు అని సంజయ్‌ రౌత్‌ అన్నారు. శరద్ పవార్ లాంటి నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదన్న ఆయన కేంద్రమంత్రి నారాయణ రాణే చేసిన ఈ వ్యాఖ్యాలకు కేంద్రమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ మద్దతు కూడా ఉందా.? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ దానిని ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు. పదవులు, అధికారంతో సంబంధం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

కాగా, తిరుగుబాటు సేన ఎమ్మెల్యేలను శరద్ పవార్ బెదిరించారని, ఎప్పటికైనా శివసేన ఎమ్మెల్యేలు ముంబైకి రావాల్సిందేనని, తమ ఇష్టపూర్వకంగా ఓటు వేయాల్సిందేనని అన్నారు. ఆయన బెదిరింపుల తరువాతే తాము ఆయనపై వ్యాక్యలు చేశామని రాణే చెప్పుకోచ్చారు. అటు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే గూటికి చేరడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా ఆ పార్టీ అగ్రనాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాతి అడుగు ఏంటన్నదానిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ నిరంతరం టచ్‌లో ఉన్నారు.  

ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతలంతా పరస్పరం టచ్‌లో ఉన్నాం. మా బలమేంటో పరీక్షలో నెగ్గి చూపిస్తాం. అవకాశాన్ని వదలుకోం.. గెలిచి తీరతాం. వాళ్లు ( రెబల్‌ ఎమ్మెల్యేలు) చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ముంబైకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇచ్చాం. ఇప్పుడు, ముంబైకి రావాలని వాళ్లను సవాలు చేస్తున్నాం. ఈ పోరాటంలో పశ్చాత్తప పడాల్సిన అవసరం లేదు. ఇంటా(అసెంబ్లీ).. బయటా(రోడ్లపై) గెలిచి తీరతాం. వాళ్లకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఇచ్చాం. కానీ, ఆలస్యమైంది. బలనిరూపణతోనే తేల్చుకోవాలని వాళ్లకు చాలెంజ్‌ చేస్తున్నా. మహా వికాస్‌ అగాడి  ప్రభుత్వం మిగిలిన రెండున్నరేళ్లు కూడా పూర్తి చేసుకుని తీరుతుందని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles