6.1 Earthquake Jolts Eastern Afghanistan అప్ఘనిస్తాన్ లో వెయ్యికి చేరిన మృతుల సంఖ్య.. 1500పైగా క్షతగాత్రులు..

Afghanistan quake kills 1 000 digging grave after grave says official

Afghanistan Earthquake, Afghanistan Earthquake death count, Afghanistan Earthquake injured, Afghanistan Earthquake houses damaged, earthquake, 6.1 magnitude, rector scale, eastern afghanistan, paktika district, Hibatullah Akhundzada, Taliban Government, Afghanistan

A powerful earthquake has killed one thousand people and left hundreds more injured in Afghanistan, a Taliban official said. Pictures show landslides and ruined mud-built homes in eastern Paktika province, where rescuers have been scrambling to treat the injured. Taliban leader Hibatullah Akhundzada said hundreds of houses were destroyed and the death toll was likely to rise. It is the deadliest earthquake to strike Afghanistan in two decades.

అప్ఘనిస్తాన్ లో వెయ్యికి చేరిన మృతుల సంఖ్య.. 1500పైగా క్షతగాత్రులు..

Posted: 06/22/2022 04:07 PM IST
Afghanistan quake kills 1 000 digging grave after grave says official

అఫ్గానిస్థాన్‌పై ప్రకృతి ప్రకోపం చూపడంతో మూడువందల వరకు భావించిన మరణాల సంఖ్య క్రమంగా వెయ్యికి చేరాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తాలిబన్ అధికారులు తెలిపారు. పర్వత ప్రాంతమై తూర్పు అప్థనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అధికారుల అంచనాలను మించి మరణాల సంఖ్య పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. గంటల వ్యవధిలోనే మృతుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 1000 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారి సంఖ్య 1500కిపైగా ఉంటుందని తెలిపారు.

ఈ ఘటన జరిగిన ప్రదేశం మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సమాచార లోపం నెలకొందని.. సహాయ కార్యక్రమాలకూ ఆటంకం కలుగుతోంది. దాంతో మరణాలపై పూర్తి స్పష్టత రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక శవాన్ని వెలికితీయగానే దాని కిందే మరో శవం లభ్యమవుతున్నాయని ఈ లెక్కన ఎంత మంది మరణించారన్న వివరాలు కూడా తెలియడం లేదని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్, పక్టికా ప్రావిన్స్‌లో సంభవించిన ప్రకృతి వైపరిత్యం తీవ్రత 6.1గా రిక్టార్ స్కేలుపై రికార్డు అయ్యిందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

పర్వత ప్రాంతంలో భారీ తీవ్రతతో భూమి కంపించడంతో ఇళ్లు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి. శిధిలాలలను పూర్తిగా తొలగిస్తే కానీ మరణాల సంఖ్య తెలియదు. అయితే సహాయకార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక పక్టికా, ఖోస్ట్ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సహాయం కోసం అర్థించే పరిస్థితి నెలకొంది. రెస్క్యూ అపరేషన్ చేపట్టిన ప్రభుత్వం క్షతగాత్రులను ఎయిర్ లిప్ట్ ద్వారా సమీప నగరాల్లోని అసుపత్రులకు వారిని తరలించి చికిత్సను అందిస్తున్నారు.

ఇక ఈ వైపరిత్యం కారణంగా భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, తమకు అంతర్జాతీయ సమాజం సహకారం కావాలని అఫ్గాన్‌ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. తాలిబన్ల ఆక్రమణతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలను ఈ భూకంపం మరింత దారుణ స్థితిలోకి నెట్టేసింది. భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోనూ కొన్ని చోట్ల ప్రకంపనలు సంభవించాయి. పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాక్‌ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh