Congress calls Delhi Police BJP's 'private militia' కాంగ్రెస్ కార్యాలయం గేట్లు బద్దలు.. నేతలను అరెస్టు చేసిన పోలీసులు.!

Congress calls delhi police bjp s private militia for entering aicc office cops deny charges

Delhi police, AICC office, Congress, Delhi police enters AICC office, Congress Leaders, Party Activists, P.Chidambaram, Vendetta Politics, National Politics

Amid crackdown on Congress leaders who are protesting over the questioning of Rahul Gandhi by the Enforcement Directorate, some leaders and even MPs have alleged that they were not allowed to go to the Congress headquarters at 24 Akbar Road here and many MPs claim that they were not even permitted to leave their house.

ITEMVIDEOS: కాంగ్రెస్ కార్యాలయం గేట్లు బద్దలు.. నేతలను అరెస్టు చేసిన పోలీసులు.!

Posted: 06/15/2022 03:53 PM IST
Congress calls delhi police bjp s private militia for entering aicc office cops deny charges

ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులను కూడా లెక్కచేయకుండా వారిని నెట్టి కిందపడేసి.. పక్కటెముకలు విరిగేలా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అక్షేపిస్తున్నారు. రాహుల్ గాంధీ త్వరలోనే దేశవ్యాప్త పాదయాత్రకు సన్నాహం అవుతున్న తరుణంలో ఆయనను ఏదో ఒక కేసులో ఇరికించి వేధించాలన్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ విచారణ తెరపైకి వచ్చిందని కూడా కాంగ్రెస్ నేతలు అరోపణలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

ఇవాళ మూడవ రోజు కూడా ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారించారు. దీంతో ఇవాళ మరోమారు కాంగ్రెస్ నేతలు, శ్రేణులు నిరసనలు కొనసాగించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో.. అక్బర్‌ రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక సమయంలో ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టిన పోలీసులు ఏఐసిసి కార్యాయంలోకి చోచ్చుకెళ్లి, తమ నేతలను అరెస్ట్‌ చేసినట్లు కాంగ్రెస్‌ ఆరోపణలకు దిగింది.

ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని అక్షేపించారు. కాంగ్రెస్ నేతలపై లాఠీలను ప్రయోగించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర చాలా మంది వ్యక్తులు పోలీసులపై బారికేడ్లు విసిరారు. కాబట్టి గొడవ జరిగి ఉండవచ్చు. అంతేగానీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లి లాఠీఛార్జ్‌ చేయలేదు.

పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయడం లేదు. మాతో సమన్వయం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాం అని ఎస్పీ హుడా, స్పెషల్ సీపీ (ఎల్‌అండ్‌ఓ) తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు ఇచ్చింది. గురువారం రాజ్‌భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. తెలంగాణలో రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా చేపట్టనున్నాయి. రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles