Bikers create ruckus with rash driving in Old city ఆర్థరాత్రి పాతబస్లీలో బైకర్స్ హల్ చల్.. అడ్డుకున్న యువకులపై దాడి.!

Bikers create ruckus with rash driving in kalapathar of hyderabad old city

Hyderabad police, Hyderabad Greater City Image, TRS Government, Law and Order in Hyderabad old city, Kalapathar, Bikers, Rash Driving, Nuisance, commotion, Old City Law and Order, Police patrolling car, Hyderabad Police, Telangana, Crime

Young men in the old town huddled on bikes. A youth rash with bikes caused a commotion in a colony in Kalapathar. Bikers attacked a young man who questioned why he was running rashly in the colony. Hyderrabad police had inquired about the inicident and observing the CCTV footage to arrest the youth.

ఆర్థరాత్రి పాతబస్లీలో బైకర్స్ హల్ చల్.. అడ్డుకున్న యువకులపై దాడి.!

Posted: 06/15/2022 12:03 PM IST
Bikers create ruckus with rash driving in kalapathar of hyderabad old city

అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను అభివృద్ది పరుస్తున్నామని ఓవైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు హైదరాబాదు ప్రతిష్టను దిగజార్చేలా పలు ఘటనలు మరోవైపు జరుగుతున్నాయి. ఇటీవల మైనర్ బాలురు మైనర్ బాలికలను ట్రాప్ చేసి.. వారిపై అత్యాచారాలు జరిపిన వరుస ఘటనలు నమోదయ్యాయి. దీంతోనే అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు విమర్శలు ఎదుర్కోంటుండగా.. వీటితో హైదరాబాద్ నగర ప్రతిష్ట కూడా మసకబారింది. విశ్వనగరం చేసేందుకు గత దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిన చర్యలపై కొన్ని వరుస ఘటనలు సవాల్ చేసేలా ఉన్నాయి.

అందులోనూ హైదరాబాద్ లోని అత్యంత సంపన్నప్రదేశమైన జూబ్లిహిల్స్ లో దారుణఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.ఈ ఘటనపై సినీనటుడు, సామాజిక కార్యకర్త సోనుసూద్, దేశ దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఖండించారు. అంతలా హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ జరిగింది. ఇక ఇటీవల మైహదీపట్నం ఆసిప్ నగర్ లో యువకులు వీరంగం చేసి ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్నే ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో జోగుతూ.. వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసులపై తిరగబడ్డి..పెట్రోలింగ్ వాహనంపైకి ఎక్కి వీరంగం వేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు.  ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలు మరువక ముందే మరోమారు పాతబస్తీలో యువకులు బైకులపై హల్ చల్ చేశారు. కాలాపత్తర్‌లోని ఓ కాలనీలో బైక్‌లతో యువత ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హంగామా చేశారు. కాలనీలో ర్యాష్‌గా ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించిన యువకుడిపై బైకర్స్ దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లోకి వెళ్లిన యువకుడిని వదలకుండా వెంబడించి.. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు గాయాలపాలైన ఇద్దరినీ చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీల ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles