American College Study on Esophageal cancer మ‌ధ్య వ‌య‌స్సువారికి అమెరికా శాస్త్రవేత్తల చేధువార్త..

Esophageal cancer results of an american college of surgeons patient care evaluation study

Middle Aged Patients, Esophageal Neoplasms. diagnosis, Esophageal Cancer, pathology, Esophagus Cancer, General Surgery, Humans, Male, Middle Aged, Neoplasm Recurrence, epidemiology, Neoplasm Staging, Postoperative Complications, epidemiology, numerical data, Societies, Medical, Tomography, X-Ray Computed, Treatment Outcome, National Institutes of Health, National Center for Biotechnology Information, United States

Cancer of the esophagus shows an increasing occurrence of adenocarcinoma in the lower third of the esophagus and is frequently associated with Barrett's esophagus. Choice of treatment was influenced by tumor histology and tumor site. Multimodality (neoadjuvant) therapy was the most common treatment method for patients with esophageal adenocarcinoma.

మ‌ధ్య వ‌య‌స్సువారికి అమెరికా శాస్త్రవేత్తల చేధువార్త.. తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డి!!

Posted: 06/14/2022 08:13 PM IST
Esophageal cancer results of an american college of surgeons patient care evaluation study

అమెరికా ప‌రిశోధ‌కులు చేదువార్త చెప్పారు. మరీ ముఖ్యంగా మ‌ధ్య వ‌య‌స్సువారికి ఇది కఠినమైన వార్త. మన దేశంలోని మధ్యవయస్కులకు కాదని ఈ వార్తను తెలిగ్గానూ తీసుకోలేం. ముందస్తుజాగ్రత్తలు తీసుకుంటే నివారణ చర్యలను చేపట్టే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఏంటా చేదువార్త అంటారా.? మధ్యవయస్సు వారికి అనగా 45నుంచి 64 ఏళ్ల వ‌య‌స్సువారు ఎక్కువ‌గా అన్న‌వాహిక క్యాన్స‌ర్ బారిన‌ ప‌డుతున్నార‌ని అమెరికా పరిశోధకులు తేల్చారు. వారు నిర్వ‌హించిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. అగ్రరాజ్యంలో 50 లక్షల మందికి పైగా ఈ క్యాన్స‌ర్‌ బారిన ప‌డుతున్న‌ట్లు గుర్తించారు.

2012 నుంచి 2019 వ‌ర‌కు అన్న‌వాహిక‌తో బాధ‌ప‌డే వారిసంఖ్య రెట్టింపు అయింద‌ని ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. కేవలం ఏడేళ్ల వ్యవధిలో ఒక్కసారిగా ఈ క్యాన్సర్ బారినపడిన వారి సంఖ్య రెట్టింపు కావడానికి కారణాలను పరిశీలిస్తున్నారు. ప‌రిశోధ‌కులు ఫ్లోరిడాలోని 45-64 ఏళ్ల మ‌ధ్య‌వ‌య‌స్సుగ‌ల‌వారిపై అధ్య‌య‌నం చేశారు. ఏడేళ్ల‌లో అన్న‌వాహిక క్యాన్స‌ర్ బాధితుల సంఖ్య రెట్టింపైంద‌ని తేల్చారు. ఇదే కాలంలో 50శాతం మంది అన్న‌వాహిక క్యాన్స‌ర్‌కు గుర‌య్యే ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని గుర్తించారు. ఈ అధ్య‌య‌నం డైజెస్టివ్ డిసీజ్ వీక్ 2022లో ప్ర‌చురిత‌మైంది.

అన్న‌వాహిక.. గొంతును కడుపుతో కలిపే పొడవైన, బోలుగా ఉండే గొట్టం. అన్న‌వాహిక క్యాన్స‌ర్ అనేది అన్న‌వాహిక క‌ణ‌జాలంలో ఏర్ప‌డే ప్రాణాంత‌క క‌ణాల వ‌ల్ల ఏర్ప‌డే ఒక వ్యాధి. ఇది ఎక్కువ‌గా ధూమ‌పానం, అధిక ఆల్క‌హాల్ తీసుకోవ‌డం వ‌ల్ల వ‌స్తుంది. అక‌స్మాత్తుగా బ‌రువు త‌గ్గ‌డం, ఆహార ప‌దార్థాలు మింగ‌లేక‌పోవ‌డం అన్న‌వాహిక క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు. నివేదిక‌ల ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్యాన్స‌ర్ మ‌ర‌ణాల‌కు ఇది ఆరో ప్ర‌ధాన కార‌ణం. ఇది వ్య‌క్తి భౌగోళిక స్థితుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. దీన్ని ఎండోస్కొపీ ద్వారా గుర్తిస్తారు. ఈ క్యాన్స‌ర్ శ‌రీరంలో అభివృద్ధి చెందేవ‌ర‌కూ ఎలాంటి సంకేతాలు క‌నిపించ‌వు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles