మనం అటవీ దారిలో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వన్యప్రాణులు ఈ మధ్యకాలంలో తమ సంతతిని పెంచుకుంటున్నాయి. చాలా ఏళ్ల తరువాత వాటికి అనువైన ప్రాంతాల్లో అవి సంతతిని పెంచుకుంటున్నాచి. ఈ క్రమంలో వాటిని వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యంతో బెదిరిపోనీయకుండా చేస్తే.. అవి వాటి సంతతిని మరింతగా పెంచుకుంటాయని ఆశించడం మంచిదే. అయితే ఒక్కసారి ఊహించుకోండి మీరు ఒంటరిగా అడవిలో వెళ్తున్నప్పుడు.. వన్యప్రాణులు కనబడితే ఏం చేస్తారు. అయితే ఏ ఏనుగు, భల్లూకము, కాకుండా ఒకవేళ పెద్దపులి ఎదురైంది అనుకోండి అప్పుడేం చేస్తారు.
పైప్రాణాలు పైనే పోయి.. మిగిలిన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏ చెట్టో, పుట్టో ఎక్కాలని ప్రయత్నాలు చేస్తారు. ఇటీవల ఉత్తరభారతంలో కూడా ఇలాంటి విచిత్ర ఘటనే జరిగింది. అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న వనదేవత ఉత్సవాలు జరుగుతుండగా, అందులో పాల్గోనేందుకు ఇద్దరు వ్యక్తులు నేరుగా బైక్ పై వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారికి పెద్దపులి ఎదురైంది. ఇంకేముంది.. బైక్ అలా వదిలేసి.. ఓ చెట్టు ఎక్కి కూర్చున్నారిద్దరూ. ఇక అలా గంటల కొ్ద సమయం దాటిన తరువాత ఇతర భక్తులు అదే మార్గంలో వాహనాల్లో రావడంతో కొంత సమయానికి పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారు బైక్ తీసుకుని మార్గమధ్యం నుంచి తిరుగుపయనం అయ్యారు.
ఇక అలాంటి చోట ఒకటి కాకుండా ఏకంగా ఆరు పులులు ఉండివుంటే.. ఏంటీ పరిస్థితి.? ఆ విషయాన్ని పక్కనబెడితే.. ఆరు పులులు ఒకే చోట సంచరించడం ఎంతమంది వీక్షించి ఉంటారు. కానీ ఈ వీడియోలో ఆరు పులులు ఒకే చోట కనిపించాయి. అవన్ని ఒకదాని వెనుక మరోకటి వరుస క్రమంలో వెళ్తూ కనిపించాయి. అటవీప్రాంతంలో ఓ మట్టిదారిని క్రాస్ చేస్తూ కనిపించాయి. ఈ టైగర్ రిజర్వులో పులులు కనిపిస్తాయని పర్యాటకులు పలు వాహనాల్లో సంచరిస్తుండగా, వాహనాల మధ్య ఏర్పడిన గ్యాప్ మధ్యలోంచి అవి ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లాయి.
ముందుగా ఒక పులి వెళ్లింది. దాని వెనకలే మూడు పులులు వరుస క్రమంలో వెళ్లాయి. ఆ తరువాత మరో రెండు పులులు వచ్చాయి. ఒక్క పులిని చూస్తేనే వామ్మో అనే పర్యాటకులు.. ఏకంగా ఆరు పులులను వీక్షించడం వారికి కన్నులపంటే. ఇంకేముందు చేతిలో వున్న కెమెరాలను వారు క్లిక్ మనిపించడం కూడా కనబుతూనే ఉంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుసాంత్ నందా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయగా, వాటిని విపరీతమైన లైకులు వచ్చాయి. ఆహా ఈ పర్యాటకులదేమీ భాగ్యం.. ఒకేసారి ఆరు పులులను వీక్షించడమంటే అసాధారణ విషయమని నెట్టిజనులు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ వీడియోను పోస్టు చేసిన సుసాంత నందా.. ఇది అద్భుత దృశ్యమని పేర్కోన్నారు. పులులు తమ సంతతిని పెంచుకుంటున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక పులి ఒక కాన్పులో 2 నుంచి 4 పిల్లలను మాత్రమే కంటుందని, అయితే ఐదు పిల్లలను కనడం అసాధారణమని పేర్కోన్నారు. ఇక దీనికి తోడు నాలుగు పిల్లలను కన్నా.. అవన్నీ పెరిగి పెద్దకావడం కూడా కానీ పులి కన్న బిడ్డలన్నీ పెరిగి పెద్దకావడం శుభపరిణామమని పేర్కోన్నారు. ఇలా పులి పిల్లలను కనడంతో అది దట్టమైన అడవని, ఇక అక్కడ మనుషుల ప్రభావం కూడా చాలా తక్కువని ఆయన తన పోస్టులో పేర్కెన్నారు.
కాగా ఇది ఎక్కడా చోటుచేసుకుందన్న వివరాలను మాత్రం ఐఎఫ్ఎస్ అధికారి పేర్కెనలేదు. దీంతో ఈ వీడయోను వీక్షించిన జంతుప్రేమికులు.. ఈ ప్రాంతం ఎక్కడ.? నాకు వెళ్లాలని ఉంది అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలకు సుసాంత నంద నుంచి ఎలాంటి బదులు రాలేదు. కాగా గత ఏడాది నవంబర్ మాసంలోనూ ఇలానే అరు పులులు మహారాష్ట్రలోని నాగపూర్ ఉమ్రేడ్ కర్హండ్ల వైల్డ్ లైప్ సాంచురీలోనూ ఆరు పులులు మట్టిరోడ్డలో నడుస్తున్న వీడియో అప్పట్లో వైరల్ కావడంతో ఆ వీడియోకు.. ఈ వీడియోకు సంబంధం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక నెటిజనుల ప్రశ్నలకు నెటిజనులే.. అది నాగ్ పూర్ అని కూడా నెటిజనులు పేర్కోంటున్నారు.
If you haven’t seen a tiger herd, here it is
— Susanta Nanda IFS (@susantananda3) June 12, 2022
Remarkable here to note is, a tigress usually have a litter of 2 to 4 only. Five is unusual and survival of all the cubs is rare. Indicating a high density of prey animals in the habitat & little human influence on it. pic.twitter.com/x4tQFiA0z1
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more