Long cohabitation presumes marriage: Supreme Court దీర్ఘకాలం సహజీవనం చేసినా దంపతులే..: సుప్రీంకోర్టు

Property rights can t be denied to son of couple who lived together supreme court

marriage,live-in relationship, supreme court, concubinage, living as a couple without marriage in India, Are live-in relationships legal in India, Live in Relationship, Supreme court, Justice S. Abdul Nazeer, Justice Vikram Nath, kerala High court, Wife and Husband, ancestral Property, Son property parents, Evidence, Property rights

The Supreme Court said the "law presumes in favour of marriage and against concubinage" if a man and woman cohabited for a long period and their son cannot be denied the shares in the ancestral properties. The Top court set aside a verdict of the Kerala High Court which had held that in case of lack of evidence of marriage, the "illegitimate" son of a man and woman, who had cohabited together, was not entitled to property rights in ancestral properties.

దీర్ఘకాలం సహజీవనం చేసినా దంపతులే.. ఆ సంతానానికి ఆస్తి హక్కు ఉంది: సుప్రీం

Posted: 06/14/2022 12:59 PM IST
Property rights can t be denied to son of couple who lived together supreme court

స్త్రీ పురుషుల సహజీవనంపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. స్త్రీ పురుషుల మధ్య దీర్ఘకాలంగా సహజీవనం కొనసాగించిన వారిని భార్యభర్తలుగానే పరిగణిచాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. ఈ బంధాన్ని అక్రమ సంబంధంగా భావించకూడదని, దానిని వివాహబంధంగానే పరిగణించాలని తెలిపింది. ఓ జంట దీర్ఘకాల సహజీవనం చేసి భార్యభర్తలుగా వ్యవహరించారంటే.. వారిది వివాహబంధంగానే పరిగణించాలని పేర్కోంది. అంతేకాదు, దీర్ఘకాలం సహజీవనం చేసిన వారికి పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా హక్కు కూడా కలిగి వుంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. సుదీర్ఘకాలం భార్యభర్తలుగా సహజీవనం చేస్తున్న జంటను ఎవిడెన్స్ యాక్టు సెక్షన్ 114 ప్రకారం భార్యభర్తులుగానే పరిగణించాలని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన ద్విసభ్య థర్మాసనం తీర్పును వెలువరించింది. వీరికి జన్మించిన సంతానానికి కూడా అస్తిలో వాటా హక్కు లభిస్తుందని తేల్చిచెప్పింది. సహజీవనం చేసిన జంటను చట్టబద్దత లేదని పేర్కోన్న కేరళ హైకోర్టు తీర్పును తప్పబడుతూ సర్వోన్నత న్యాయస్థానం సహజీవనం జంటలు, సంతానంపై సంచలన తీర్పును వెలువరించింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వారికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే, వీరు వివాహం చేసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి పుట్టిన బాబును అక్రమ సంతానంగా పేర్కొంటూ పూర్వీకుల ఆస్తిలో అతడికి వాటా దక్కదని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు 2009లో తీర్పు నిచ్చింది. దీంతో బాధిత జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా వీరి పిటిషన్‌ను జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా కేరళ హైకోర్టు తీర్పుతో విభేదించింది. ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తుంటే వారు వివాహం చేసుకున్నట్టుగానే పరిగణించాలని పేర్కొంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్ప వారి బంధాన్ని భార్యాభర్తల్లానే పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే, వారు పెళ్లి చేసుకోలేదని నిరూపించాల్సిన బాధ్యత మాత్రం సవాల్ చేసిన వారిపైనే ఉంటుందని పేర్కొంది. అలాగే, ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ అన్ని కోర్టులను సుప్రీం ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles