Gorilla Reaction Wins The Internet సైకిల్ తొక్కిన గొరిల్లా.. కిందపడగానే ఏం చేసిందో తెలుసా.?

Gorilla rides a bicycle throws it away after falling off video leaves netizens in splits

Gorilla rides a bicycle, Gorilla fall down while riding cycle, gorilla throws it away after falling off; gorilla video leaves netizens in splits, Gorilla Reaction Wins The Internet, Gorilla Reaction Wins Netizens, gorilla, cycle, IFS Officer, Dr Samrat Gowda, Socilal media, Twitter, Reaction, Internet, cartoons, viral video, video viral

Have you ever seen an actual gorilla riding a bicycle? Well, we've only seen something like this in cartoons. Well, it happened in real life and we had to share it with you. IFS Officer Dr Samrat Gowda shared the video of a gorilla riding a bicycle. But that's not the only fun part of the video. After a few seconds of riding the cycle, the animal loses control and falls off. In anger, the ape then throws away the bicycle, making everyone laugh out loud.

ITEMVIDEOS: సైకిల్ తొక్కిన గొరిల్లా.. కిందపడగానే ఏం చేసిందో తెలుసా.?

Posted: 06/11/2022 08:54 PM IST
Gorilla rides a bicycle throws it away after falling off video leaves netizens in splits

పొడవాటి చేతులు, విశాలమైన ఛాతీలతో బుల్‌డోజర్లలా ఉండే గొరిల్లా.. ఒక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేసిందీ గొరిల్లా. వినడానికి విచిత్రంగా వున్నా ఇది పక్కా నిజం. బహుశా ఇలాంటి వీడియోలు చూసిన తరువాతే కార్టూనిస్టులు ఈ విధంగా డిజైన్ చేసి.. పిల్లలను అకర్షిస్తారా.? అన్నట్లుగా ఉంది. అంతేకాగా మరి.. మనుషులు ఏది ఆచరిస్తే.. వాటిని నిశితంగా గమనించిన జంతువులు తరువాత వాటిని ఆచరించాస్తాయని వాటి పరిశీలన కూడా నూటిని నూరు శాతం పక్కగా ఉంటుందని అంటారు.

అందుకనే తక్కువ జనసాంధ్రత ఉన్న పలు గ్రామాల్లో జంతువులు ఇలాంటి చర్యలకు పాల్పడతాయనే పెద్దలు ఎవరిు గమనించకుండా ఇంట్లోకి రావాలి, ఇంటోంచి వెళ్లాలని కూడా సూచనలు చేస్తుంటారు. ఆ విషయాన్ని పక్కనబెడితే భల్లూకము ఇలా సైకిల్ తొక్కుతూ రావడాన్ని గమనించిన డాక్టర్ సామ్రాట్ గౌడ  అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్.. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక గొరిల్లా కింద కూర్చొని ఉండగా.. మరో గొరిల్లా ఒక చిన్న సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వచ్చింది.

అలా కొంచెం దూరం వెళ్లిందో లేదో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయింది. పడిపోయాననే కోపంతో సైకిల్‌ను ఎత్తి విసిరేసిందా గొరిల్లా. ఈ వీడియోను షేర్ చేసిన సామ్రాట్ గౌడ.. ‘‘స్టుపిడ్ సైకిల్’’ అంటూ గొరిల్లా మనసులోని మాటను ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లంతా నవ్వలేక చస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఒక యూజర్.. ‘‘స్టుపిడ్ సైకిల్.. నన్నే పడేస్తావా? నువ్వు నాకొద్దు.. అనుకున్నట్లున్నాడు’’ అంటూ ఆ గొరిల్లా గురించి కామెంట్ చేశాడు. ఏదిఏమైనా ఇప్పటి వరకు 65 వేలపైగా వ్యూస్ తెచ్చుకున్న ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తూనే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gorilla  cycle  IFS Officer  Dr Samrat Gowda  Socilal media  Twitter  Reaction  Internet  cartoons  viral video  video viral  

Other Articles