Train thieves arrested by Hyderabad police, CCTV footage వామ్మో దొంగలు: ఇలా వేలాడి కూడా దొంగతనం చేస్తారా.?

Bihar thief stole a phone from a moving train spider man style

Spider-Man’ style Thief, Smart Phone, jhapta gang, Begusarai, Patna-Katihar Intercity Express, Railway Police, thief’s Spider-Man abilities, Mohammad Sameer, Victim, Patna to Katihar, phone snatching, phone robbery, robbery, thief hangs on bridge, Bihar, Crime

In a shocking incident, a thief was seen stealing a mobile phone from a passenger who was sitting on a moving train at the doorstep. The incident took place on the Katihar-Barauni rail route and the police called the thieves as "jhapta gang". From the viral video, the victim identified as Mohammad Sameer was seen sitting at the edge of the train while it crossing a bridge and suddenly a person who was hanging from the steel foundation of the bridge snatched the mobile from the person.

ITEMVIDEOS: వామ్మో దొంగలు: ఇలా వేలాడి కూడా దొంగతనం చేస్తారా.?

Posted: 06/10/2022 01:51 PM IST
Bihar thief stole a phone from a moving train spider man style

రణమో.. మరణమో అన్నట్లుగా పరిస్థితులు మారితే తప్ప.. ఇలాంటి సాహసాలు చేయడానికి ఎవరూ అంగీకరించరు. కానీ ఇలాంటి సాహసాలు చేసేందుకు తెగించారంటే వారికి అది ఎంత అసరమో కూడా అర్థమవుతుంది. కానీ దాని విలువ ఎంతో తెలియకుండా.. అది చౌకైన వస్తువా..? లేక ఖరీదైన వస్తువా అన్న వివరాలు కూడా తెలియకుండా.. దాని కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ చౌర్యాకళను ప్రదర్శించడం.. దుస్సాహసమే అవుతుంది. ఇలాంటి పనులకు పాల్పడిన నేపథ్యంలో ఎవరైనా ఈ సాహసం చేసిన వ్యక్తులను దారుణంగా తిట్టేస్తారు. కానీ ఈ సూపర్ మ్యాన్ సాహసాన్ని ప్రదర్శించిన వ్యక్తికి నెటిజనులు ఫిదా అయ్యారు.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. చేసిన సాహసం ఏమిటీ.? ఆ వస్తువు ఏమిటీ..? ఈ కథ ఏమిటీ అన్న వివరాల్లోకి వెళ్తే.. ఆ వ్యక్తి ఓ దొంగ. రైలు మార్గంలో వచ్చే నదులపై నిర్మించిన ఉక్కు వంతెనలపై నిలబడి ఉన్నాడు. రైలులో ఎవరైనా ప్యాసింజర్లు రైలుద్వారం వద్ద నిల్చుని నదిని వీడియో తీయాలని లేదా.? ఫోటో తీయాలని ప్రయత్నించినా.. లేక చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చున్నా చాలు వారి టార్గెట్ ఆ వ్యక్తే. అయితే అది తాపీగా చేసుకుని వెళ్లే పని కాదు.. గంటకు ముఫై నుంచి నలభై కీలోమీటర్ల వేగంతో వంతనపై నుంచి రైలు వెళ్తున్న క్షణాల సమయంలో చేయాల్సిన పని. ఆ పనేంటంటే వారి చేతిలోని ఫోన్ లాగేసుకోవడం.

అలాంటి వ్యక్తులను టార్గెట్ చేసిన దొంగ.. వంతెనపై నిల్చుని.. టార్గెట్ సమీపించగానే.. ఒక చేత్తో బ్రిడ్జిని పట్టుకుని, మరో చేతిని రైలు డోర్ వద్దకు చాచి.. ప్యాసెంజర్ల చేతిలోంచి ఫోన్ చటుక్కున లాగేసుకుంటాడు. అయితే ఫ్యాసింజర్ల చేతిలో ఉన్నది చైనా ఫోనా.? లేక ఖరీదైన స్మార్ట్ ఫోనా.? అన్న వివరాలు కూడా తెలియకుండా ఇంతటి సాహసం చేయడం మూర్ఖత్వమే. ఒక వేళ.. అదుపుతప్పితే రైల్వే వంతెనపై బడి అక్కడి నుంచి నదిలోకి జారీ పడి.. బతికినా.. తీవ్రగాయాలపాలు కావడం.. ఒక్కోసారి శరీర అవయవాలు కూడా తొలగిచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అయినా దోంగ చేసిన వినూత్న ప్రయత్నాన్ని మాత్రం నెట్ జనులు ప్రశంసిస్తున్నారు.

బీహార్‌లోని పాట్నా- బెగుసరాయ్‌లను కలిపే రాజేంద్ర సేతు రైల్వే వంతెనపై జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రైల్వే బ్రిడ్జీపై ఇంటర్‌ సిటీ రైలు వెళ్తున్నది. ఒక బోగిలోని డోర్‌ వద్ద ఇద్దరు యువకులులు కూర్చొన్నారు. ఇంతలో ఆ ఇనుప వంతెనపై వేలాడుతున్న ఒక దొంగ, డోర్‌ వద్ద కూర్చొన్న వ్యక్తి చేతిలోని మొబైల్‌ ఫోన్‌ను కొట్టేశాడు. ఆ వ్యక్తి ఆ విషయాన్ని వెంటనే గ్రహించలేక పోయాడు. అసలేం జరిగిందో కూడా ఆ సమయంలో తెలుసుకోలేకపోయాడు. ఆ తరువాత షాక్‌ నుంచి తేరుకుని పైకి లేచి రైలు నుంచి తొంగి బయటకు చూశాడు.

అప్పటికే కదులుతున్న రైలు ముందుకు సాగడంతో ఎవరూ కనిపించలేదు. అయితే బ్రిడ్జీపై వేలాడుతున్న వ్యక్తి తన చేతిలోని మొబైల్‌ ఫోన్‌ను చాకచక్యంగా చోరీ చేసినట్లు చివరకు గ్రహించాడు. మరోవైపు వెరైటీగా మొబైల్‌ ఫోన్లు, జేబులు కొట్టేసే ఈ దొంగకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘బీహార్‌లోని రైల్వే వంతెనపై కొత్త స్పైడర్ మ్యాన్’ పేరుతో ఈ వీడియోను కొందరు షేర్‌ చేశారు. రైల్వే వంతెనపై ప్రమాదకరంగా వేలాడుతూ రైల్లో ప్రయాణించే వారి జేబులు, మొబైల్స్‌ను లూఠీ చేస్తున్న అతడి తెలివిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేశారు. ఇలాంటి చోరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొందరు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles