Drive against vehicles causing noise pollution హైదరాబాదులో హారన్ల మోతపై త్వరలో కఠిన చర్యలు..

Hyderabad traffic police to bring new rules to curb vehicular noise pollution

Hyderabad Traffic Police, Hyderabad City Police, Traffic Police Chief, Avie Ranganath, Sound pollution, Air Pollution, reduction, Hyderabad Police noise pollution drive, noise pollution, Hyderabad city, noise pollution, Traffic Police, best livable city, new rules, curb noise pollution, vehicle owners, horn, hyderabad traffic, crime

The Hyderabad City Police to bring new rules to curb vehicular noise pollution in the city. Hyderabad Traffic Police appealed to the citizens to join hands in making Hyderabad the “Best Liveable and Non-Polluted City. During the recent drive, traffic police personnel destroyed dozens of motorbike exhaust silencers and seized two-wheelers.

హైదరాబాదులో హారన్ల మోతపై కఠిన చర్యలు.. త్వరలో కొత్త రూల్స్..

Posted: 06/09/2022 01:58 PM IST
Hyderabad traffic police to bring new rules to curb vehicular noise pollution

హైద‌రాబాద్‌లో అంత‌కంత‌కూ వాహ‌నాల సంఖ్య పెరుగుతోంది. అదే స‌మ‌యంలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోతోంది. వాయు కాలుష్యం త‌గ్గించేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌లు ఓ మోస్త‌రు ఫ‌లితం ఇస్తున్నా.. శబ్ద కాలుష్యం త‌గ్గించ‌డంలో మాత్రం అనుకున్న మేర ఫ‌లితాలు రావ‌డం లేదు. దీంతో న‌గ‌ర ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం ఇప్పుడు కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లులోకి తీసుకువ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నిబంధ‌న‌లు మ‌రో నెల‌లోనే అందుబాటులోకి రానున్న‌ట్లు న‌గ‌ర ట్రాఫిక్ పోలీస్ చీఫ్ ఏవీ రంగ‌నాథ్ చెబుతున్నారు.

ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం అన‌వస‌రంగా హార‌న్‌ కొట్టే వారిని అత్యాధునిక కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించ‌నున్నారు. అన‌వ‌స‌ర హార‌న్ మోతాదును బ‌ట్టి వాహ‌న‌దారుడిపై చ‌ర్య‌లు తీసుకుంటారు. ఈ చ‌ర్య‌ల కింద జ‌రిమానాలు, భారీ జ‌రిమానాలు విధించ‌డంతో పాటు ఏకంగా వాహ‌న‌దారులను కోర్టులో హాజ‌రుప‌రిచే దాకా శిక్ష‌లు ఉన్నాయి. ఈ మేర‌కు మోటారు వాహ‌నాల చ‌ట్టంలోని 119 సెక్ష‌న్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్త‌వానికి వాహ‌నాల శబ్ద కాలుష్యాన్ని కొలిచేందుకు ఇప్ప‌టికే న‌గ‌రంలో జ‌పాన్ సాంకేతిక‌తతో త‌యారైన కెమెరాలను పోలీసులు వినియోగిస్తున్నారు.

ర‌ద్దీగా ఉండే ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఇప్ప‌టికే వీటిని ఏర్పాటు చేశారు కూడా. అయితే ఆయా వాహ‌నాల నుంచి వ‌చ్చే శబ్దాన్ని గుర్తించి ఆయా వాహ‌నాల నెంబ‌ర్ల‌ను స్కాన్ చేస్తూ ఆ వివ‌రాల‌ను క‌మాండ్ కంట్రోల్‌కు పంపడం ఈ కెమెరాల‌తో సాధ్యం కావడం లేదు. దీంతో స‌ద‌రు కెమెరాల‌ను మ‌రింత‌గా అభివృద్ధి చేసే దిశ‌గా జ‌పాన్ సంస్థ‌ను ట్రాఫిక్ పోలీసులు సంప్ర‌దించారు. అందుకు ఆ కంపెనీ కూడా ఓకే చెప్పింద‌ట‌. ఇంకో నెల‌లో అభివృద్ధి చేసిన కెమెరాలు ట్రాఫిక్ పోలీసుల‌కు అంద‌నున్నాయి. ఇవి అంద‌గానే... న‌గ‌రంలో అన‌వ‌‌స‌రంగా హార‌న్ మోగించే వారిని గుర్తించి శిక్ష‌లు అమ‌లు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు స‌న్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles