Hizbul commander killed in encounter in Anantnag అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. హిజ్బుల్‌ కమాండర్‌ హతం

Jammu and kashmir hizbul commander killed in gunfight in anantnag say police

Nisar Khanday, Commander, Hibul Muzahiddin, Encounter, Indian Army, Kashmir militancy, J&K, Anantnag gunfight, Vijay Kumar, Jammu Kashmir Police, Anantnag District, Jammu Kashmir, Crime

A Hizbul Mujahideen commander was killed in a gunfight with security forces in Jammu and Kashmir’s Anantnag district, the police said on Saturday. The commander of the militant outfit has been identified as Nisar Khanday. Inspector General of Police (Kashmir Range) Vijay Kumar had said in the early hours of Saturday that the gunfight was still on.

కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. హిజ్బుల్ కమాండర్ ను మట్టుబెట్టిన ఆర్మీ

Posted: 06/04/2022 12:14 PM IST
Jammu and kashmir hizbul commander killed in gunfight in anantnag say police

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. హిందూ ఉద్యోగులు, ప్రజలను లక్ష్యంగా చేసుకుని లోయలో కోనసాగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో కాశ్మీర్ పోలీసులు, బధ్రతా దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కూంబింగ్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్‌నాగ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ కమాండర్ హతమయ్యాడు. జిల్లాలోని రిషిపోరా గ్రామం కప్రాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు శుక్రవారం సాయంత్రం గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత హిజ్బుల్ కమాండర్ నిసార్ ఖండేను మట్టుబెట్టామని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని చెప్పారు. వారిని హెలికాప్టర్‌లో దవాఖానకు తరలించామన్నారు. ఉగ్రవాది నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో సహా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles