200 women affected after gas leak in AP అమోనియా గ్యాస్ లీక్.. 100 మంది మహిళా కార్మికులకు అస్వస్థత

Over 30 female workers fall sick due to gas leakage in visakhapatnam

Ammonia gas leakage in Anakapalli, Women employees, veterinary drugs company, Porus Laboratories, Atchutapuram Special Economic Zone, Anakapalli SP Gautami Sali, No Fatalities, Ammonia, gas leak, women workers, Atchutapuram sez, vomiting, headache, burning sensation in eyes, Anakapalli, Andhra Pradesh, Crime

About 200 women workers of an apparels firm fell sick after a gas leakage at adjacent veterinary drugs company in Andhra Pradesh’s Anakapalle district. The gas leak occurred at Porus Laboratories affecting staff of an adjacent firm in the Special Economic Zone (SEZ) in Atchutapuram area. The affected women complained of vomiting, headache and burning sensation in eyes.

అనకాపల్లిలో అమోనియా గ్యాస్ లీక్.. 100 మంది మహిళా కార్మికులకు అస్వస్థత

Posted: 06/03/2022 03:25 PM IST
Over 30 female workers fall sick due to gas leakage in visakhapatnam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు గ్యాస్ లీక్ ఘటన పెనుకలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్​ సెజ్​ పరిధిలోని పోరస్ కంపెనీలో రసాయన వాయువు లీక్ కావడంతో అనేక మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పోరస్ కంపెనీలో అమోనియా వాయువు లీకైంది. దీంతో పక్కనున్న సీడ్స్ కంపెనీలో పనిచేసే వంద మందికి పైగా మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమోనియా వాయువును పీల్చుకున్న మహిళలు తీవ్ర లక్షణాలతో ఇబ్బందులు పడ్డారు. కోందరికి వాంతులు, తల తిరగడం, కళ్ల మంటలెత్తడం ఇలా పలువురు పలు లక్షణాలతో ఇబ్బంది పడ్డారు.

అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటిన బ్రాండిక్స్ సెజ్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కాగా కొందరు మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తేలడంతో వారిని అంబులెన్సుల్లో అనకాపల్లిలోని ఎన్టీఆర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో మహిళా సెక్యూరిటీ సూపర ​వైజర్‌ పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే అమెకు అసరమైన చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. అమోనియా లీక్‌ ఘటన వివరాలు తెలుసుకున్న కలెక్టర్ రవిసుభాష.. మహిళా కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి హేమంత్ కుమార్‌ను ఆదేశించారు.

అస్వస్థులైన మహిళలకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు బ్రాండిక్స్‌ భారత భాగస్వామి దొరైస్వామి చెప్పారు. సెజ్‌కు వెలుపల ఉన్న పోరస్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకైందని.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. దీనివల్లే సమస్య తలెత్తిందన్నారు. ఈ లీక్ వార్త అందిన వెంటనే పోరస్‌ కంపెనీ నిర్వాహకులు అమోనియో లీకేజీని అరికట్టినట్లు చెప్పారు. అయితే ఈ రసాయన వాయువు ఎలా లీకైందన్న కారణాలేంటన్నది తెలుసుకుంటున్నట్లు వివరించారు. కంపెనీ సేప్టీ అధికారులు దీనిని పరిశీలించి యాజమాన్యానికి నివేదిక అందించనున్నారు.

అమోనియా లీకేజీ ఘటనతో అప్రమత్తమైన బ్రాండిక్స్‌ నిర్వాహకులు.. రెండో షిఫ్ట్‌ రద్దు చేశారు. ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించివేశారు. ఇదిలా ఉండగా ఈ రసాయన వాయువు లీక్ ఘటనపై ప్రభుత్వం కూడా విచారణకు అదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమోనియా గ్యాస్ లీక్‌ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిని సందర్శించాలని పరిశ్రమల శాఖ మంత్రికి సూచించారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles