Govt raises premium for flagship insurance schemes PMJJBY, PMSBY నాలుగు వందల రెట్టు పెరిగిన సురక్షా బీమా యోజన ప్రీమియం

Government revises premium rates of flagship pm jeevan jyoti bima yojana pm suraksha bima yojana

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, PMJJBY, Pradhan Mantri Suraksha Bima Yojana, pmsby, insurance, health insurance, narendra modi, insurance, Govt Health insurance, Narendra Modi, Premium hiked

The Government has increased the premium rates of its flagship schemes Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) and Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) with effect from 1 June. The premium rates of the schemes have been revised by making it Rs 1.25 per day premium for both schemes that includes revising PMJJBY from Rs 330 to Rs 436 and PMSBY from Rs 12 to Rs 20.

రూ. 12 నుంచి 456కు.. 400 రెట్లు పెరిగిన సురక్షా బీమా యోజన ప్రీమియం

Posted: 05/31/2022 09:00 PM IST
Government revises premium rates of flagship pm jeevan jyoti bima yojana pm suraksha bima yojana

ఎన్డీయే తొలివిడద అధికార పగ్గాలు చేపట్టిన తరుణంలో నామ‌మాత్ర‌పు ప్రీమియంతోనే దేశ ప్ర‌జ‌ల‌కు భీమా యోజనను అందించిన కేంద్రప్రభుత్వం.. ఎనిమిదేళ్ల కాలంలో అందులోనూ కరోనా మహమ్మారి లాంటి కంటికి కనిపించని శత్రువు దాడితో అతలాకుతలమైన పేద, మధ్యతరగతి ప్రజలపై అన్ని భారాలు పెరుగుతున్న క్రమంలో భీమా యోజన ప్రీమియం మొత్తాన్ని కూడా పెంచిన కేంద్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మరో గుదిబండ మోపింది. అందిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న ప్రీమియంను కేంద్ర ప్ర‌భుత్వం భారీగా పెంచేసింది.

ప్ర‌స్తుతం ఈ బీమా కోసం ఏడాదికి కేవలం రూ.12 వ‌సూలు చేస్తుండ‌గా...ఇప్పుడు ఆ ప్రీమియాన్ని ఏకంగా రూ.456కు పెంచేస్తూ కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 18 నుంచి 70 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి ఈ ప‌థ‌కం కింద బీమాను క‌ల్పిస్తూ మోదీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకు ఖాతా ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఈ ప‌థ‌కం వ‌ర్తించేలా కేంద్రం ఈ ప‌థ‌కానికి రూప క‌ల్ప‌న చేసింది. ఏడాదికి కేవలం రూ.12ల ప్రీమియంతోనే ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం సంభ‌వించినా, శాశ్వ‌త వైక‌ల్యం సంభివించినా రూ.2 ల‌క్ష‌ల బీమా, పాక్షిక వైక‌ల్యానికి రూ.1 ల‌క్ష బీమా అందుతుంది.

ఈ ప‌థ‌కం బీమా ప్రీమియాన్ని పెంచేసిన ప్ర‌భుత్వం రోజుకు రూ.1.25 చొప్పున ప్రీమియం వ‌సూలు చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. ఇక ఇదే త‌రహాలో ఏడాదికి రూ.330 ప్రీమియంతో ప్రారంబించిన ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ప్రీమియాన్ని కూడా కేంద్రం పెంచింది. ఈ ప్రీమియాన్ని కూడా రోజుకు రూ.1.25కు పెంచుతున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. ఫ‌లితంగా ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారులు రూ.330కి బ‌దులుగా ఏడాదికి రూ.456 చెల్లించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles