Madhya Pradesh beggar buys bike for his wife భార్య ఆరోగ్యం కోసం.. త్రీ విలర్ బైక్ కొన్న యాచకుడు.!

Beggar buys 90 000 bike after wife complains of backache spends life savings

Beggar buys bike, Madhya Pradesh beggar buys bike, MP beggar buys bike for wife, Madhya Pradesh beggar viral video, beggar,begging,Santosh Kumar Sahu,Chhindwara,beggar buys bike,moped,beggar buys moped for wife,madhya pradesh beggar buys moped, Santosh Sahu, MP beggar, wife Munni, backache, New Three Wheeler bike, Chhindwara, Madhya Pradesh, viral video

A beggar from Madhya Pradesh's Chhindwara district has bought a moped worth Rs 90,000 as a gift for his wife Munni. Santosh Sahu, from Amarwara village in Chhindwara got the bike because his wife complained of a backache caused by sitting on the tricycle owned by him earlier. Sahu collected the money over the last four years to buy the moped for his wife.

ITEMVIDEOS: భార్య ఆరోగ్యం కోసం.. త్రీ విలర్ బైక్ కొన్న యాచకుడు.!

Posted: 05/24/2022 09:23 PM IST
Beggar buys 90 000 bike after wife complains of backache spends life savings

ప్రతీ మగవాడి జీవితంలోనూ మౌనంగా వెనకాలే ఉంటూ ముందుకునడిపే స్త్రీమూర్తి ఉంటుంది. అమె ధర్మపత్ని. ఆ జీవిత భాగస్వామి కోసం ఎవరైనా ఏమైనా చేశారా.? అంటే మీనవేషాలు లెక్కించేవారి సంఖ్యే ఎక్కువ. కానీ ఇక్కడ ఈ యాచకుడు తన భార్య కోసం రూపాయి రూపాయి పోదుపు చేసి ఏకంగా కొత్త మూడు చక్రాల బండినే కొన్నాడు. ఔనా.. అంటూ విస్తుపోవాల్సినంత అవసరం లేదు. దాదాపుగా ఆరయ్యవ పడిలోకి అడుగుపెడుతన్న ఆయన.. ఈ వయస్సులో తన భార్య కోరిక తీర్చాలని ఎందుకు భావింాడు. భిక్షాటనే చేస్తూనే దానిని ఎలా సఫలీకృతం చేశాడు.?ఎందుకనీ ఆయన ఈ బండి కొన్నాడు అన్న వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా కేంద్రంలో వీరు ట్రై సైకిల్ (మూడు చక్రాల సైకిల్) ద్వారా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. సంతోష్ కుమార్ సాహుకు కాళ్లలో వైకల్యం ఉంది. అందుకే అతడు మూడు చక్రాల సైకిల్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటే.. అతడి భార్య సైకిల్ ను వెనుక నుంచి నెట్టేది. ఆలయాలు, మసీదుల వద్ద వీరు అడ్డుక్కునేవారు. అయితే, వయసు పెరగడం, కచ్చా రోడ్లు, ఎత్తయిన చోట్ల సైకిల్ ను తోయాల్సి రావడంతో సాహు భార్యకు నడుము నొప్పి వేధించసాగింది. ఆమె నొప్పితో నరకాన్ని అనుభవిస్తుంటే సాహు చూడలేకపోయాడు.

ఇంతకాలం రూపాయి, రూపాయి అడుక్కుని కూడబెట్టుకున్న సొమ్ముతో త్రిచక్ర మోటారు మోపెడ్ ను కొనుగోలు చేశాడు. రూ.90,000 ఖర్చు అయింది. దీంతో తోసే పని తప్పింది. దాంతో ఇద్దరూ కలసి సులభంగా ఎక్కడికైనా చేరుకుని భిక్షాటన వృత్తిని చేసుకుంటున్నారు. అయితే ఈ బైక్ తో వచ్చిన మార్పు ఏంటంటే.. మోటారు వాహనం వల్ల తాము ఇప్పుడు సియోని, ఇటార్సీ, భోపాల్, ఇండోర్ ప్రాంతాలకు కూడా వెళ్లి అడుక్కోగలుగుతున్నట్టు సాహు చెప్పాడు. వీరి సంపాద రోజువారీగా గతంలో అయితే రూ.300-400 వరకు ఉండేది. మారుతున్న జీవన విధానాలు, ఖర్చు పెట్టే ధోరణులకు ఇది కూడా ఒక నిదర్శనమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles