Man falls while climbing Dam wall in Karnataka 30 అడుగులపై నుంచి జారిపడ్డ యువకుడు

Watch man falls while trying to climb srinivasa sagara dam wall in karnataka

Man falls while climbing Srinivasa Sagara Dam, Srinivas Sagar dam in Chikkaballapura, Stunt goes horribly wrong, Caught on cam, Viral Accident, Srinivasa Sagara dam, dam wall in Karnataka, video of Srinivasa Sagara dam wall, Srinivasa Sagara dam wall, Youth, daredevilry video wrong, scaling dam wall, Gauribidanur taluk, Chikkaballapur, Karnataka, viral video, video viral, crime

In a daredevilry that went wrong, a man sustained serious injuries while trying to climb up the wall of Srinivasa Sagara dam in Karnataka's Chikkaballapur district. In a video, which is being circulated on social media, the man is seen climbing the dam wall while people look on. But after scaling the wall halfway, he lost his balance and fell to the ground, injuring himself.

ITEMVIDEOS: ప్రాణాలపైకి తెచ్చిన సరదా ఫీట్.. 30 అడుగులపై నుంచి జారిపడ్డ యువకుడు

Posted: 05/23/2022 06:34 PM IST
Watch man falls while trying to climb srinivasa sagara dam wall in karnataka

ధైర్యే సాహసే లక్ష్మీ అంటారు.. కానీ కొన్ని సాహసాలు చేసేప్పుడు మాత్రం తప్పక అందుకు తగ్గ తర్ఫీదు అవసరం. లేకపోతే ఎంతటి ప్రమాదమో సంభవిస్తుందో చెప్పే అవకాశమే ఉండదు. అందుకనే ఏదైనా ఫీటు చేసేప్పుడు కచ్చితంగా నిపుణుల పర్యవేక్షణ అవసరం. అయితే ఇది వారి ఏ క్షణంలోనైనా పట్టుతప్పితే.. ఏమి జరగకుండా ఉండేందుకు దోహదపడేలా చేస్తోంది. కానీ ఉడుకు రక్తం ఉరుకలేస్తున్న క్రమంలో దేనిని లెక్కచేయక ఓ యువకుడు చేసిన సాహసం.. బాగానే సాగింది. అయితే దాదాపుగా మూడింట రెండొంతుల సాహసం చేసిన తరువాత ఫీటు చేజారింది.

అంతే ఎంతో పైనుంచి ఒక్కసారిగా కిందకు జారిపోయాడు. అంతటి కష్టతరమైన ఈ ఫీటు సరదాకు చేసిన యువకుడిని ఆసుపత్రిపాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చింది. డ్యామ్ అధికారులు వద్దని వారించినా పట్టించుకోకుండా అరుదైన ఫీటు చేయబోయిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల కర్నాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్‌ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్‌ నీళ్లు కిందకు వస్తున్నాయి. వేసవిలో దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ‍్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ యువకుడు(20) పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాకు ట్రెక్కింగ్‌ చేయబోయాడు. అతడు దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. కాగా, ఆనకట్ట దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడి ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles