పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్య కారణాలరీత్యా తానులొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని కోరుతూ సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడం కుదరదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో సిద్ధూ నేడో రేపో సిద్ధూ లొంగిపోవాల్సి ఉంటుంది. టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు అత్యున్నత న్యాయస్థానం నిన్న ఏడాది జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.
1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది. మరోవైపు, తాను లొంగిపోవడానికి కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టును సిద్ధూ కోరారు. తనకు ఆరోగ్యం బాగోలేదని... ఈ కారణం వల్ల తనకు కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. సిద్ధూ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టులో వాదనలు జరిగాయి.
క్రైమ్ జరిగి ఇప్పటికే 34 ఏళ్లు గడిచిపోయాయని... సుప్రీంకోర్టు శిక్షను విధించడం కూడా జరిగిందని... ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వారాల సమయం కావాలని అడగడం సరికాదని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, సింఘ్వీ తన వాదలను వినిపిస్తూ... తన క్లయింట్ లొంగిపోతాననే చెపుతున్నారని, కేవలం కొంత సమయాన్ని మాత్రమే అడుగుతున్నారని కోర్టుకు తెలిపారు. సమయాన్ని ఇవ్వడం, ఇవ్వకపోవడమనేది కోర్టు నిర్ణయమని అన్నారు. ఈ సమయంలో జస్టిస్ ఖన్విల్కర్ కలగజేసుకుంటూ... సమయాన్ని కోరుతూ ఒక అప్లికేషన్ ను ఫైల్ చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more