Tourist bus catches fire on Katra route in JK బస్సు ప్రమాదం.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

4 killed 20 hurt as bus catches fire in jammu and kashmir

J&K, Katra route, Katra route in J&K, Katra route, Tourist bus, J&K, Katra route in JK, Tourist bus catches fire, jammu and kashmir, bus catches fire, jammu news, crime

Four persons were killed and 20 others injured when a local bus caught fire near Katra in Jammu and Kashmir under mysterious circumstances. The bus was on its way from Katra to Jammu, police said, adding that the incident took place at Khanak, around 1.5 km from Katra. According to preliminary investigations, the engine of the bus had caught fire, which soon engulfed the entire vehicle.

జమ్మూకాశ్మీర్ లో బస్సు ప్రమాదం.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

Posted: 05/13/2022 08:32 PM IST
4 killed 20 hurt as bus catches fire in jammu and kashmir

వైష్టోదేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమవ్వగా..సుమారు 22 మంది గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ రేసీ జిల్లా కట్రా ప్రాంతంలో మంటలు అంటుకుని భక్తులు ప్రయాణించే బస్సులో భక్తుల ఆర్తనాథాలు మిన్నంటాయి. కట్రా నుంచి జమ్ము వెళుతుండగా నొమాయ్‌ వద్ద బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు కట్రా వద్ద బేస్‌ క్యాంపు ఉంటుంది. బాధితులంతా వైష్ణో దేవిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైష్ణోదేవీ మాతా ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారిని భక్తిశ్రద్దలతో కొలచిన భక్తులు అదే భక్తి తన్మయత్వంలో తిరిగి కత్రా నుంచి జమ్మూకి వస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కత్రా నుంచి 1.5 కి.మీ దూరంలోని ఖర్మల్‌ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఎండ వేడి కారణంగా బస్సు ఆయిల్‌ ట్యాంకర్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, బాంబు పేలుడు జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh