Sedition law put on hold! SC stays proceedings under Sec 124A దేశద్రోహం చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేసిన ‘‘సుప్రీం’’

India s top court halts use of controversial sedition law in rebuke to the government

Sedition law challenged, sedition law in Supreme court, Sedition Law Validity, Attorney General K K Venugopal, five-judge Constitution bench, Solicitor General Tushar Mehta, sedition law case, supreme court sedition law case, sc sedition law, sedition law case date, sedition law case hearing, National, Crime

India's top court ordered the temporary suspension of the country's controversial sedition law, putting pressure on the government which has been accused of misusing it to stifle free speech. The colonial-era law will be paused until the government completes a review, the Supreme Court said. No further cases should be registered under the law until the review is complete, it added, in an apparent rebuke to the government.

దేశద్రోహం చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేసిన ‘‘సుప్రీం’’, స్టే విధింపు

Posted: 05/11/2022 03:10 PM IST
India s top court halts use of controversial sedition law in rebuke to the government

బ్రీటీషు కాలం నాటి దేశద్రోహం చట్టం అమలుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని, ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని పేర్కొంది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది సీజేఐ ధర్మాసనం.

అంతకు ముందు.. దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించిన క్రమంలో వివరణ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశ ద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించే వరకు కొన్ని చర్యలు తీసుకోవచ్చని, అందుకోసం ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలను ధర్మాసనం ముందు ఉంచుతున్నట్లు పేర్కొన్నారు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. దేశద్రోహ చట్టం నమోదు చేయాలంటే ఎస్పీ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలన్నారు.

రాజద్రోహం సెక్షన్ 124ఎ రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.. కేంద్ర తరఫున వాదనలు వినిపించారు తుషార్​ మెహతా. రాజద్రోహం వ్యవహారంలో గుర్తించదగిన నేరం విషయంలో ఎఫ్​ఐఆర్​ నమోదును ఆపలేమని కోర్టుకు తెలిపారు సొలిసిటర్​ జనరల్​ మెహతా. పెండింగ్​లో ఉన్న దేశద్రోహం కేసులను కోర్టుల ముందే పెండింగ్​లో ఉన్నాయని, కోర్టులే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. దేశద్రోహానికి సంబంధించిన కేసుల్లో బెయిల్​ దరఖాస్తుపై సత్వర విచారణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles