On Sedition Law, SC Seeks Centre's Reply In Next 24 Hours దేశ‌ద్రోహ కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయరాదు: సుప్రీం

Centre to reconsider sedition law sc asks what about pending cases

sedition law, supreme court, sedition law, Supreme Court, central government, sedition law provision, central government on sedition law, reconsider sedition law, central government, section 124a, Sedition challenge, Sedition Law, sedition, Indian Penal Code

The Supreme Court of India heard Indian Government plea to defer a ruling on the Constitutional validity of Section 124A under the Indian Penal Code. The Union Government had asked time to review the Sedition law that came into being during the British colonial rule in India.

దేశ‌ద్రోహ కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయరాదు: సుప్రీం

Posted: 05/10/2022 05:42 PM IST
Centre to reconsider sedition law sc asks what about pending cases

బ్రిటీషు కాలం నాటి దేశ‌ద్రోహ చట్టం కొనసాగింపుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో తొలుత ఈ చట్టాన్ని కొనసాగించాలని వాదనలు వినిపించిన కేంద్రం తరువాత వెనక్కుతగ్గిన విషయం తెలిసిందే. దేశద్రోహం చట్టంపై పునఃసమీక్షిస్తామని అత్యన్నత న్యాయస్థానంలో తెలిపింది. దీంతో ఇవాళ మరో పర్యాయం ఈ కేసు విషయమై విచారించిన న్యాయస్థానం.. కేంద్రం పునఃసమీక్షించి నిర్ణయం తీసుకునే వరకు దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం అదేశించింది.

ఈ చట్టాన్ని ర‌ద్దు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేంద్రస‌ర్కార్ ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌(ఐపీసీ)లోని 124ఏ చ‌ట్టాన్ని సంపూర్ణంగా స‌మీక్షించ‌నున్న‌ట్లు కోర్టుకు విన్న‌వించింది. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ నేప‌థ్యంలో పాతకాలం చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ కోరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని కూడా ర‌ద్దు చేయాల‌ని భావించారు. సెక్షన్ 124ఏ ప్రకారం కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అప్పటివరకు కేసులు నిలిపివేత సాధ్యాసాధ్యాలపై ఆరా తీసింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. దేశద్రోహం చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. అదేసమయంలో, దేశద్రోహం చట్టంపై పునఃపరిశీలన ప్రక్రియను 3-4 నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. దేశద్రోహం చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని యోచిస్తోందనే విషయాన్ని వివరించాలని కోరింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బుధవారం స్పందన సమర్పించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central government  section 124a  Sedition challenge  Sedition Law  sedition  Indian Penal Code  

Other Articles